అన్ని పేపర్లూ ఒక ఆదివారం సంచిక ఇస్తున్నాయి కాబట్టి, అది ఇచ్చితీరాల్సింది అయిపోయింది. కానీ ఏం ఇవ్వాలి? దానికి ఏం పేరు పెట్టాలి? కేవలం ‘సాక్షి ఆదివారం’ అంటే సరిపోదు. దానికో బ్రాండింగ్ ఇవ్వాలి. దానికో ఫిలాసఫీ ఉండాలి. ఫన్ ఉండాలి, లైట్ రీడింగ్ కావాలి, ఎమోషన్ ఇవ్వాలి... ఈ ఆలోచనల ఆలంబనగా ‘ఫన్‌డే’ పురుడు పోసుకుంది. 2008 మార్చి 30న ఫన్‌డే తొలిసంచిక వచ్చింది. 25.36 సెంటీమీటర్లు ఎత్తు, 19.23 సెంటీమీటర్లు వెడల్పు, 44 పేజీలు, గ్లేజ్డ్ కవర్ మీద హీరోయిన్ ముఖచిత్రం, మూడు సీరియళ్లు, కిసుక్కులు, కార్టూన్లు, కాలమ్స్‌తో మార్కెట్లోని వీక్లీలను తలదన్నేలా ముస్తాబై వచ్చింది. ‘హావ్ ఫన్’ అంటూ ఫీచర్స్ ఎడిటర్ రేపటికి ముందడుగు వేశారు. ‘హోమ్ థియేటర్’లో పిడుగులు తెగ అల్లరి చేశారు. ‘ముచ్చటైన ఆశ’ అంటూ భార్యాభర్తలు ఒకరినొకరు ఈ ‘అనుబంధం’ వేదికగా తమ అనుబంధాల్ని చాటుకున్నారు. ‘చిన్నారి కళ’ అంటూ పిల్లలు వారి బొమ్మలతో వాళ్ల వాళ్ల స్కూళ్లలో సెలబ్రిటీలు అయిపోయారు. ‘మా ఊరి ముచ్చట’ అంటూ ఎంతోమంది తమ ఊరిమూలాల్ని తడుముకున్నారు. ‘జనపదం’ అంటూ వారి ప్రాంతానికే ప్రత్యేకమైన మాటలను రాసిపంపారు.
తెరమరుగైన నటులు ఇప్పుడేం చేస్తున్నారో ‘అజ్ఞాతవాసం’ గుర్తుచేసింది. సులభమైన అర్థ వివరణతో ‘వేమన్న వెలుగులు’ మరింత చేరువయ్యాయి. ‘అన్నమయ్య అన్నమాట’ ఆయన భావాల్ని మరింత సుకరం చేసింది. ‘యుద్ధక్షేత్రం’ సైనికుల జీవితాల్లోని గొప్ప అనుభవాలను అందించింది. పోలీస్ అధికారుల వృత్తిజీవితంలో ఛేదించిన ‘బెస్ట్ కేస్’ ఏమిటో తెలిసేలా చేసింది. పురాణాల్లోని చక్కటి నీతి కథలను ‘పురానీతి’గా అందిస్తోంది. అలనాటి మేటి కథకులతోపాటు నేటి ‘కొత్త కథలోళ్ల’కు కూడా పెద్దపీట వేస్తోంది. ఈ పదేళ్లలో ఇంకా ఎన్నో కాలమ్స్ ఫన్‌డేను పాఠకులు తమ గుండెలకు హత్తుకునేలా చేశాయి. నా మొదటి సినిమా, ప్రకృతి వైద్యం, నామవాచకం, నో ప్రాబ్లమ్, బేతాళ ప్రశ్నలు, పదశోధన, రాలిన మొగ్గలు, పదాలు పెదాలు, ఆజన్మం, రియాలిటీ చెక్, గ్రేట్ లవ్‌స్టోరీస్, మెడికల్ మెమరీస్, మీరే పారిశ్రామికవేత్త, నిజాలు దేవుడికెరుక, సినిమా వెనుక కథ, సత్వం, శ్రీకారాలు శ్రీమిరియాలు, రిలేషణం, సీన్ మాది టైటిల్ మీది, తెలుగు జాతీయాలు, సినిమా వెనుక కథ, లేడీస్ టైలర్, ఫన్‌టైమ్, ఉత్తమ విలన్, కిర్‌ర్‌ర్, కొత్త పదం...
పదేళ్లలో ఎన్నో ప్రత్యేక ఫన్‌డే సంచికలు వచ్చాయి. వాలెంటైన్స్ డే స్పెషల్, న్యూ ఇయర్ స్పెషల్, సరళీకరణ 20 ఏళ్ల స్పెషల్, పచ్చళ్ల స్పెషల్, అనుబంధాల మీద సినిమా పాటల స్పెషల్, యోగా స్పెషల్, ముగ్గు ముచ్చట్ల మీద స్పెషల్. తిరుమల బ్రహ్మోత్సవాల సంచిక ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నాం. 100వ సంచిక సందర్భంగా ‘తప్పక చూడాల్సిన 100 సినిమాలు, వినాల్సిన 100 పాటలు, చదవాల్సిన 100 పుస్తకాలు’ ఒక గ్రాండ్ సక్సెస్. లైబ్రరీ ఎడిషన్ లాంటి ఈ కాపీలు దొరక్క జిరాక్సులు చేసిపెట్టుకున్నవాళ్లున్నారు. ఫన్‌డే వేదికగా వచ్చిన టార్గెట్ 8, తాడంకి, ది థర్డ్, డేగ రెక్కల చప్పుడు, లోయ నుంచి శిఖరానికి, మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఆకుపచ్చ సూర్యోదయం, రామానుజ మార్గం సీరియల్స్ ప్రత్యేక ఆదరణను చూరగొన్నాయి. మిగతా ఆదివారం అనుబంధాలకు భిన్నంగా, కాలానుగుణంగా పాఠకుల అభిరుచికి అద్దం పడుతూ, రూపాన్ని మార్చుకున్నప్పటికీ సారంలో ఏ ఆలోచనతో మొదలైందో అదే ‘ఫన్’థాలో ఈ పదేళ్లుగా సాగుతోంది ఫన్‌డే! రొటీన్ ఆదివారం అనుబంధాలకు భిన్నంగా, కాలానుగుణంగా పాఠకుల అభిరుచికి అద్దం పడుతూ, రూపాన్ని మార్చుకున్నప్పటికీ సారంలో ఏ ఆలోచనతో మొదలైందో అదే ‘ఫన్’థాలో ఈ పదేళ్లుగా సాగుతోంది ఫన్‌డే!
పదేళ్ల ఫన్
Published Sat, Mar 24 2018 12:12 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment