జాకట్టు
ఒకప్పుడు చీరకి బ్లౌజ్ మ్యాచ్ చేసేవారు. ఇప్పుడు... ట్రెండ్ మారింది. ఒక బ్లౌజ్ డిజైన్ చేయించి నాలుగు చీరలు మ్యాచ్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో చీరకంటే బ్లౌజే ఖరీదు. అలాంటి కొన్ని ట్రెండీ.. న్యూ స్టైల్.. ఫ్యాషనబుల్.. హాపెనింగ్.. జా‘కట్టు’ల గురించి మీ కోసం...
టు టోన్ శారీస్‌కి బార్డర్ స్లీవ్స్: ఖాదీ, ఉప్పాడ, కంచి పట్టు చీరలు ప్రస్తుత ట్రెండ్‌లో ముందున్నాయి. వీటిలో ప్లెయిన్‌గా ఉండే టు టోన్ శారీస్ మరింత ప్రాచుర్యంలో ఉన్నాయి. పెద్ద పెద్ద బార్డర్ చీరలను అతివలు బాగా ఇష్టపడుతున్నారు. వీటికి బ్లౌజ్ గ్రాండ్‌గా ఉండేలా డిజైన్ చేయించుకుంటున్నారు. లాంగ్ స్లీవ్స్, దాని మీద పెద్ద బుటా వర్క్ ప్రత్యేక ఆకర్షణను తెస్తున్నాయి.
బార్డర్ స్లీవ్స్‌పై ఇంపైన డిజైన్: పట్టు చీర బార్డర్‌ని స్లీవ్స్‌కి వేయించుకొని, బాగా హైలైట్ చేస్తున్నారు. ఈ స్లీవ్స్ మీద డిజైన్స్ కూడా బాగా ఇష్టపడుతున్నారు.
కాంట్రాస్ట్ కలర్స్: చీరలకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వాడటం అనేది ఈ మధ్య మళ్ళీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. లాంగ్ స్లీవ్స్‌కి హెవీ వర్క్‌ని ఇష్టపడుతున్నారు. పెళ్ళిళ్లలాంటి వేడుకల్లో ఇలాంటివి బాగా ధరిస్తున్నారు. బంగారు, గంధపు రంగు చీరలు ఉంటే బ్రైట్ రెడ్, గ్రీన్ కలర్ పట్టు జాకట్టులకు జర్దోసి, నక్షీ, స్వరోస్కితో వర్క్‌లను ఇష్టపడుతున్నారు.
ఫ్రెంచ్‌నాట్ స్టైల్: పూర్తి కాంట్రాస్ట్ బ్లౌజ్‌ను ఎంచుకొని శారీలోని ఏదైనా ఒక కలర్ థ్రెడ్‌తో బ్లౌజ్‌మీద వర్క్ చేయడం దీని ప్రత్యేకత.
షార్ట్ స్లీవ్స్ హెవీ డిజైన్: సింపుల్‌గా కావాలనుకునేవారు షార్ట్ స్లీవ్స్‌కి వెళుతున్నారు. అయితే, వీటి మీద మళ్ళీ. ఆలోవర్ బుటా, స్లీవ్స్ అడుగుతున్నారు.
నెటెడ్ లాంగ్ స్లీవ్స్: ఇంకొందరు బ్రొకెడ్ బాడీపార్ట్ అడిగినా దానికి నెటెడ్ లాంగ్ స్లీవ్స్ కావాలంటున్నారు.
బోట్‌నెక్ హవా: ఈ మధ్య కాలంలో బోట్‌నెక్స్‌దే హవా అంతా! వీటిలో చాలా రకాల స్టైల్స్ వచ్చాయి. కలంకారీ, బ్యాక్ ఓపెన్ బాగా నడుస్తుంది. పట్టు మాత్రమే కాకుండా డిజైనర్, హ్యాండ్లూమ్ శారీస్‌కి ఈ నెక్ డిజైన్ మంచి ఎంపిక.
- కాలర్‌నెక్ డిజైన్స్‌ను ముప్పై ఏళ్లు పైబడిన వారు బాగా వాడుతున్నారు. అయితే, ఆభరణాలు వేసుకోవాలనుకునేవారు మాత్రం హాఫ్ కాలర్‌ని ఇష్టపడుతున్నారు. దీంట్లో షర్ట్ కాలర్, హాఫ్ కాలర్, చైనీస్ కాలర్.. అంటూ చాలా రకాలున్నాయి.
- పాతకాలం నాటి లుక్‌ని ఇష్టపడేవారు కాలర్ లేని హైనెక్ లైన్‌ని కోరుకుంటున్నారు. దీనికీ ముప్పై ఏళ్ల వయసు పై బడినవారు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఖాదీ, భాగల్‌పూరి, ఇకత్, పోచంపల్లి వంటి శారీస్‌కి హుందాతనాన్ని పెంచే లుక్‌ని ఇస్తుంది.
- ఇరవై ఏళ్ల పైబడినవారు షోల్డర్‌లెస్ స్టైల్‌ని ఇష్టపడుతున్నారు. పట్టు చీరలకు లాంగ్ స్లీవ్స్, 3/4 స్లీవ్స్ ఎంచుకుంటున్నారు.
- బోట్‌నెక్స్, హై నెక్స్‌ని నలభై ఏళ్ల పైబడినవారి ఎంపిక అవుతుంది.
- జాకెట్ మెటీరియల్స్‌లో పట్టు, రా సిల్క్, నెటెడ్, ప్రింటెడ్, ఫ్లోరల్ డిజైన్స్ ప్రస్తుతం బాగా వాడుకలో ఉన్నాయి.
- వర్ష మహేందర్,
బ్లౌజ్ డిజైనర్, జస్ బ్లౌజ్, హైదరాబాద్