చారెడు ఉప్పు... చిటికెడు పసుపు
- దోసెపిండి పులిసినట్టుగా అనిపించినప్పుడు కొద్దిగా గోధుమపిండిని కలిపితే... పులిసిన వాసన తగ్గడంతో పాటు దోసెలు రుచిగా వస్తాయి.
- బంగాళదుంపలు ఉడికించే నీటిలో చిటికెడు ఉప్పు వేస్తే... తొక్క తేలికగా ఊడి వస్తుంది.
- చీమల బెడద ఎక్కువగా ఉంటే... అవి తిరుగుతున్న చోట కాస్త బేబీ పౌడర్‌ను చల్లాలి.
- ఇంగువ ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే... అది ఉంచిన డబ్బాలో ఒక ఎండు మిరపకాయ వేయాలి.
- నీటిలో చిటికెడు పసుపు కలిపి గదిలో చల్లితే దోమల బెడద తగ్గుతుంది.
- దోసెల పిండి రుబ్బేటప్పుడు కాసింత లేత సొరకాయ గుజ్జు కూడా కలిపి రుబ్బితే... దోసెలు మృదువుగా రావడమే కాక ప్రత్యేక రుచి వస్తుంది.
- కాకరకాయ చేదుగా ఉంటుందని పిల్లలు తినడం లేదా? అయితే కాకరకాయ కూర వండేటప్పుడు అందులో కొన్ని మామిడికాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు... కొత్త రుచి వస్తుంది.
- టొమాటోలు త్వరగా ఉడకాలంటే... వాటిని ఉడికించేటప్పుడు చిటికెడు ఉప్పు, కొద్దిగా చక్కెర వేయాలి.