మెరుగులు మెరుపులు | health tips for teeths | Sakshi
Sakshi News home page

మెరుగులు మెరుపులు

Published Fri, Aug 5 2016 12:22 AM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

మెరుగులు మెరుపులు - Sakshi

మెరుగులు మెరుపులు

అరటిపండు తొక్కల లోపల ఉండే తెల్లని గుజ్జును తీసుకోవాలి. ప్రతిరోజూ బ్రష్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జుతో పళ్లు తోముకోవాలి. పది నుంచి ఇరవై రోజుల పాటు ఇలా చేస్తే... రంగు మారిన దంతాలు మళ్లీ తళతళలాడతాయి.

బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి, ఆ మిశ్రమంతో పళ్లు తోముకుంటే గార వదిలిపోతుంది. దంతాలు మెరుస్తాయి.
నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకుని రోజూ తోముకుంటే... దంతాలు శుభ్రంగా ఉంటాయి. దంత, చిగుళ్ల సమస్యలు కూడా దరి చేరవు.
 
స్ట్రాబెర్రీలను మెత్తని పేస్ట్‌లా చేసి, అందులో కాసింత బేకింగ్ సోడాని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించి వేలితో కానీ, బ్రష్‌తో కానీ దంతాలను రుద్దుకుంటే పసుపురంగు పోతుంది.
 
కలబంద గుజ్జు... అదేనండీ అలోవెరా జెల్ పళ్లకు పూయాలి. పది నిమిషాలు అలాగే వదిలేసి, ఆ తర్వాత గోరువెచ్చని నీటిని పుక్కిలించాలి. ఆపైన మామూలుగా బ్రష్ చేసుకోవాలి. వారానికోసారైనా ఈ చిట్కాని పాటిస్తే దంతాలు సురక్షితంగా ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement