దేవతావృక్షాలలో వట వృక్షం ఒకటి. వటవృక్షం అంటే మర్రిచెట్టు. మన జాతీయ వృక్షం. మర్రిచెట్టువేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు కొమ్మలు శివునికి నివాసస్థలాలు. వటవృక్షం అంటే మర్రిచెట్టు. భారతీయుల జాతి వక్షం. మర్రిచెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు.
మర్రిచెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలాలుగా పురాణాలు పేర్కొంటున్నాయి. సౌభాగ్యం కోసం, సంతానం కోసం మర్రిచెట్టును పూజించడం, ప్రదక్షిణలు చేయడం పరిపాటి. జ్యేష్ఠమాసంలో వటసావిత్రీ వ్రతం చేయడం ఆచారం. ఆయుర్వేదంలో మర్రిచెట్టుకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. మర్రి నీడ కింద సేద తీరితే మనసుకు, శరీరానికి సాంత్వన కలుగుతుంది. గ్రహదోషాలను పోగొట్టడంలో కూడా మర్రి ప్రధాన పాత్రను పోషిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment