
ట్రంప్‌కి చెంపదెబ్బ
సమ్‌థింగ్ స్పెషల్
అసహనం గురించి, విద్వేషం గురించి ప్రపంచానికి లెక్చర్లిచ్చే అమెరికా ఇప్పుడు అసహనంతో ఊగిపోతోంది. ఏకంగా అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్న డోనాల్డ్ ట్రంప్ స్థాయి వ్యక్తి ముస్లింలను అమెరికాలోకి రానీయకూడదంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని చూసి కలవరపడుతున్న అమెరికన్ జనం కూడా ట్రంప్‌ను లైక్ చేస్తున్నారు. ఈ సమయంలో గల్ఫ్ యుద్ధంలోనే బాంబు దాడిలో కాలు పోగొట్టుకున్న క్రిస్ హెర్బర్ట్ అనే ఓ మాజీ సైనికుడు ట్రంప్‌కి చెంపదెబ్బ లాంటి జవాబిచ్చాడు. గతాన్ని మరచిపొమ్మని బతుకు బాటలో ముందుకు సాగమని పిలుపునిచ్చాడు.
తన మిత్రుడిని చంపి, తన కాలు పోయేలా చేసినవాడు ముస్లిమే. కానీ తనకు, తన కుంటుంబానికి ఎన్నో విధాల సాయం చేసిన వాళ్లూ ముస్లింలేనని ఒక పోస్టును సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ పోస్టు ఇప్పుడు అమెరికా, యూరప్‌లలో హల్ చల్ చేస్తోంది. చాలా మంది ఫేస్‌బుక్కులో, ట్విట్టర్‌లో ఈ పోస్టును ప్రశంసిస్తున్నారు.