పరిశోధనకు చేయూత
పగలంతా చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్... రాత్రయ్యేసరికి మనతోపాటే నిద్దరోవడం కద్దు. పీసీ స్థాయి సామర్థ్యమున్న ఈ స్మార్ట్‌ఫోన్లు ఆ సమయంలోనూ ఏదైనా పనికొచ్చే పనిచేయగలిగితే...? ఈ అద్భుతమైన ఆలోచనకు రూపమే.. ‘పవర్‌స్లీ’ అప్లికేషన్. గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు... ఖాళీగా ఉన్న సమయంలో దీని ప్రాసెసర్ శక్తిని ఉపయోగించుకుని వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను పరుగులు పెట్టిస్తారు.
అలారం క్లాక్ తరహాలో కనిపించే ఈ అప్లికేషన్‌ను ఉపయోగించినప్పుడు వైఫై నెట్‌వర్క్ సాయంతో ప్రొటీన్లకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తుంది. కేన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులకు మెరుగైన చికిత్స కనుక్కోవడంతోపాటు బయోకెమిస్ట్రీ, జెనిటిక్స్ తదితర రంగాల్లో గణనీయమైన మార్పుకు అవకాశమున్న ఈ పరిశోధనలో మీరూ పాలుపంచుకోవాలనుకుంటే వెంటనే పవర్‌స్లీప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. రోజుకు ఎన్ని గంటలు ఈ పనిచేయాలో కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 60 వేల పీసీల సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటున్న ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడంలో సామ్‌సంగ్ సాయం అందించింది.
హోమ్ స్క్రీన్‌కు హంగులు
స్మార్ట్‌ఫోన్ హోమ్‌స్క్రీన్‌ను అందంగా ఉంచుకోవాలని మనం రకరకాల స్క్రీన్‌సేవర్లను, వాల్‌పేపర్లను డౌన్‌లోడ్ చేసుకుంటూంటాం. అయితే వీటిలో మనదైన రీతిలో మార్పులు చేసుకునే అవకాశముండదు. ఈ కొరత తీరాలంటే గూగుల్ ప్లే స్టోర్‌లోని ‘థీమర్’ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. డజన్లకొద్దీ థీమ్ లు ఉన్న ఈ అప్లికేషన్‌లో ప్రతి థీమ్‌ను మనకు కావాల్సినట్లు మార్చుకునే వీలుండటం విశేషం. ప్రస్తుతానికి బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఉచితంగా అందుబాటులోకి వచ్చిన తరువాత దీన్ని పనిచేయించేందుకు ఒక కోడ్ అవసరమవుతుంది.