the application
-
‘ముందు’కొస్తే కటకటాలే!
రోడ్డుపై వ్యాపారుల ఆగడాలకు చెక్ దుకాణం ముందు ఖాళీ స్థలం ఉంది.. అక్కడ షెడ్ వేసి వస్తువులు బయటపెట్టుకొని వ్యాపారం చేసుకుందామనుకుంటే ఇక కుదరదు. ఇన్నాళ్లు జరిగింది.. భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందనుకుంటే పొరపాటు.. ఖాళీ స్థలాల్లో అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆదిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా 39(బీ) అప్లికేషన్ రూపొందించారు. దీని కారణంగా వాణిజ్య సముదాలు, ప్రైవేట్ దుకాణాలు, వ్యాపారుల ఆగడాలు అదుపుకానున్నాయి. - సాక్షి, సిటీబ్యూరో రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసే వారి పనిపట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి చర్యలకు చెక్ పెట్టనున్నారు. ఇందుకు 39(బీ)ను ఉపయోగించనున్నారు. ఇలా పనిచేస్తుంది జీపీఎస్ ఉన్న వీడియో స్వీప్ కెమెరాలు ట్రాఫిక్ పోలీసుల వాహనంపైనే పెట్టి తిప్పుతారు. ఆ వీడియో ద్వారా ఫొటోలను తీసుకుని ఏ ఏ దుకాణం నిబంధనలు అతిక్రమించిందో గుర్తిస్తారు. జీపీఎస్ లోకేషన్ ద్వారా సంబంధిత ఫొటోతో పాటు సదరు వ్యాపారి ట్రేడింగ్ లెసైన్స్, ప్రాంతం, సమయం తదితర వివరాలను 39(బీ) అప్లికేషన్లో నిక్షిప్తం చేస్తారు. తరువాత ఆ వివరాలను, జరిమానాను సంబంధిత వ్యాపారికి పంపుతారు. అపుడు చలాన్ చెల్లించాలి. ఇలా మూడుసార్లు ఒకే వ్యక్తి తప్పుచేస్తే అతని ట్రేడ్ లెసైన్స్ రద్దుచేయడంతోపాటు మూడు నెలల జైలు శిక్షణ కూడా విధిస్తారు. డ్రంకన్ డ్రైవ్ స్ఫూర్తితో.. నగరంలో పకడ్బందీగా సాగుతున్న డ్రంకన్ డ్రైవింగే స్ఫూర్తిగా ఈ ఆలోచన వచ్చింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఐదుసార్లు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తి...ఇటీవల మళ్లీ పట్టుబడ్డాడు. సదరు వాహన నంబర్ ఆన్లైన్లో చెక్ చేయగా... ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ సిస్టమ్‌లో నిక్షిప్తమై ఉన్న అతడి డాటా వచ్చేసింది. ఆరోసారి పట్టుబడటంతో అతడికి మూడు నెలల జైలు శిక్షను విధించారు. ఈ ఘటనతోనే ప్రభుత్వ స్థలాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న వారికి చెక్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అందుకే 39(బీ) అప్లికేషన్ కార్యరూ పం దాల్చిం దని ట్రాఫిక్ పోలీసు అదనపు డీసీ రంగనాథ్ తెలిపారు. -
శరీర నిర్మాణం... వివరంగా!
సంక్లిష్టమైన మానవ శరీర నిర్మాణాన్ని, అవయవాలను సూక్ష్మస్థాయిలో చూడటం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చుగానీ.. వైద్య విద్యార్థులకు మాత్రం వరమేనని చెప్పాలి. అలాంటి వారి కోసం రూపొందించిన అప్లికేషన్ ఈ అనాటమీ 4డీ. దీంట్లోని లైబ్రరీ నుంచి మీకు నచ్చిన చిత్రాన్ని తీసుకుని ప్రింట్ చేయడం ద్వారా ఈ అప్లికేషన్ తన పని మొదలుపెడుతుంది. స్కాన్ చేసిన చిత్రాన్ని టేబుల్‌పై ఉంచి స్కాన్ చేశారనుకోండి. ఆ చిత్రంలోని అన్ని అవయవాలు సూక్ష్మ వివరాలతో కనిపిస్తాయి. కేవలం చూడటానికి మాత్రమే కాకుండా... వాటి నుంచి ప్రయాణం చేస్తున్న అనుభూతి కల్పించడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత. -
ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ‘కెమెరా 51’
ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఒక గైడ్‌లాగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. ఫోటోను క్యాప్చర్ చేయడానికి తగు సూచనలు ఇస్తూ మీ చేత బెస్ట్ ఫోటోలను తీయిస్తుందని ఈ అప్లికేషన్ రివ్యూల్లో పేర్కొన్నారు. ఆటో ఫ్రేమింగ్, ఆటో కంపోజిషన్ టెక్నాలజీతో ఉంటుంది ఈ ఆప్. ప్రత్యేకించి సెల్ఫీలను తీసుకోవడం విషయంలో కూడా ఇది చక్కటి గైడ్‌గా ఉంటుందట. మరి స్మార్ట్‌ఫోన్ కెమెరాను మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయోపడుతుంది. -
భలే ఆప్స్
మీరు గానీ ఒక ఈలగానీ వేస్తే... ఈల వేస్తే గుర్రం పరుగెత్తుకుంటూ రావడం సినిమాల్లో చూసుంటాం. మరి ఇదే మాదిరిగా మీ ఫోన్ కూడా వచ్చేస్తుందా? ‘విజిల్ మీ ఫ్రీ’ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే పరుగెత్తుకుంటూ రాకపోవచ్చుగానీ... తాను ఎక్కడున్నదీ చెప్పేస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా అంతా టెక్నాలజీ మహిమ. మీ ఈలకు ఎలా స్పందించాలన్నది కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు రింగ్‌టోన్‌ను స్పందనగా పెట్టుకోవచ్చు. లేదంటే.. ‘ఐ యామ్ హియర్’ అని పలికేలానూ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడబడితే అక్కడ పెట్టేసి మరచిపోయే వాళ్లకు చక్కటి అప్లికేషన్ ఇది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తుంది. దారి చూపే ‘నావీమ్యాప్స్’ గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయమీ అప్లికేషన్. భారతదేశానికి సంబంధించిన ప్రత్యేక ఫీచర్లతో దీన్ని సిద్ధం చేసింది మ్యాప్‌మై ఇండియా సంస్థ. రెండు నెలల క్రితం ఆండ్రాయిడ్ ఫోన్లకు, తాజాగా ఐఫోన్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు ఏకకాలంలో మూడు దారులు చూపే ఈ నావిగేషన్ అప్లికేషన్‌తో మీరు ఉన్న ప్రాంతంతోపాటు రూట్‌మ్యాప్‌ను ఫేస్బుక్, ఈమెయిల్, మెసేజ్‌ల ద్వారా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు కూడా. ఐఫోన్ 5, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫ్రోయో వెర్షన్ లేదా అంతకంటే తాజా ఓఎస్‌తో పనిచేస్తుందీ అప్లికేషన్. ఇవి ఉచితంగా లభించే అప్లికేషన్ ఫీచర్లు కాగా, రూ.620 చెల్లించి డౌన్లోడ్ చేసుకోగల ప్రొఫెషనల్ వెర్షన్లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. మార్గమధ్యంలో ఎప్పుడు ఎటువైపు తిరగాలో ఇంగ్లీషుతోపాటు పది భారతీయ భాషల్లో సూచించడం వంటివి దీన్లో ఉన్నాయి. బ్యాంబూ పేపర్... స్మార్ట్‌ఫోన్‌లో నోట్స్ రాసుకునేందుకు అప్లికేషన్లు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరింది ‘బ్యాంబూ పేపర్’. కాకపోతే కొంచెం తేడా ఉంది. మిగిలినవి టైప్ చేయాల్సి వస్తే... ఈ అప్లికేషన్‌ను సై ్టలస్తోనూ వాడుకోవచ్చు. అక్షరాలను టైప్ చేసుకోవడంతోపాటు చిన్నచిన్న గ్రాఫ్‌లు, బొమ్మల్ని గీసుకోవడం కూడా సై ్టలస్తో సాధ్యమవుతుంది. నోట్స్‌కు ఫొటోలు జతచేయగలగడం, విండోస్ 8తోపాటు సోషల్ మీడియా, డ్రాప్‌బాక్స్, టంబ్లర్ వంటి క్లౌడ్ ఆధారిత సర్వీసుల ద్వారా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. స్కెచ్‌లు గీసేందుకు, రాసుకునేందుకు వేర్వేరు సై ్టలస్లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉచితంగానే లభించినప్పటికీ సరిపోయే సై ్టలస్ల ధర మాత్రం రూ.700 నుంచి మొదలవుతుంది. -
స్మార్ట్ ‘ట్రిక్స్’
పరిశోధనకు చేయూత పగలంతా చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్... రాత్రయ్యేసరికి మనతోపాటే నిద్దరోవడం కద్దు. పీసీ స్థాయి సామర్థ్యమున్న ఈ స్మార్ట్ఫోన్లు ఆ సమయంలోనూ ఏదైనా పనికొచ్చే పనిచేయగలిగితే...? ఈ అద్భుతమైన ఆలోచనకు రూపమే.. ‘పవర్స్లీ’ అప్లికేషన్. గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు... ఖాళీగా ఉన్న సమయంలో దీని ప్రాసెసర్ శక్తిని ఉపయోగించుకుని వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను పరుగులు పెట్టిస్తారు. అలారం క్లాక్ తరహాలో కనిపించే ఈ అప్లికేషన్‌ను ఉపయోగించినప్పుడు వైఫై నెట్వర్క్ సాయంతో ప్రొటీన్లకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తుంది. కేన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులకు మెరుగైన చికిత్స కనుక్కోవడంతోపాటు బయోకెమిస్ట్రీ, జెనిటిక్స్ తదితర రంగాల్లో గణనీయమైన మార్పుకు అవకాశమున్న ఈ పరిశోధనలో మీరూ పాలుపంచుకోవాలనుకుంటే వెంటనే పవర్స్లీప్ను డౌన్లోడ్ చేసుకోండి. రోజుకు ఎన్ని గంటలు ఈ పనిచేయాలో కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 60 వేల పీసీల సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటున్న ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడంలో సామ్సంగ్ సాయం అందించింది. హోమ్ స్క్రీన్కు హంగులు స్మార్ట్‌ఫోన్ హోమ్‌స్క్రీన్‌ను అందంగా ఉంచుకోవాలని మనం రకరకాల స్క్రీన్‌సేవర్‌లను, వాల్పేపర్లను డౌన్లోడ్ చేసుకుంటూంటాం. అయితే వీటిలో మనదైన రీతిలో మార్పులు చేసుకునే అవకాశముండదు. ఈ కొరత తీరాలంటే గూగుల్ ప్లే స్టోర్‌లోని ‘థీమర్’ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. డజన్లకొద్దీ థీమ్ లు ఉన్న ఈ అప్లికేషన్లో ప్రతి థీమ్‌ను మనకు కావాల్సినట్లు మార్చుకునే వీలుండటం విశేషం. ప్రస్తుతానికి బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఉచితంగా అందుబాటులోకి వచ్చిన తరువాత దీన్ని పనిచేయించేందుకు ఒక కోడ్ అవసరమవుతుంది.