
తుమ్ము వేగం...!
ఈ చలికాలంలో అలర్జీ వల్ల తుమ్ములు చాలా సాధారణం. తుమ్ము వచ్చినప్పుడు నోటి ద్వారా వచ్చే తుంపర్లు గంటకు 160 కి.మీ. (దాదాపు గంటకు వంద మైళ్లు) వేగంతో ప్రయణిస్తాయి.ఒకసారి తుమ్మినప్పుడు ఆ క్షణ కాలంలోనే కనీసం నోటి నుంచి లక్ష జీవులు బయటకు వెలువడతాయి.
అందుకే మనం లాంగ్ స్లీవ్స్ దుస్తులు ధరించి ఉంటే... తుమ్మే సమయంలో మోచేతి మడత వద్ద ఉండే ఆ లాంగ్ స్లీవ్స్‌ను మన నోటికి అడ్డుగా ఉండేలా జాగ్రత్త పడాలి.