
జాతకంలోని గ్రహాల బలాబలాల మేరకు కొన్ని కొన్ని దశలలో, కొన్ని కొన్ని గోచార పరిస్థితుల్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు బాధించకుండా ఉండాలంటే...
♦ రోజువారీ విధి నిర్వహణ కోసమే కావచ్చు లేదా ఏదైనా ప్రత్యేకమైన పనిమీదనే కావచ్చు... ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావద్దు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పండ్లు లేదా పూలు లేదా మిఠాయిలు వంటివి తీసుకురావడం మంచిది.
♦ చిన్న రాగినాణేన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి, దానిని వీధిగుమ్మం దగ్గర తోరణానికి వేలాడదీయండి. ప్రతికూల శక్తుల నుంచి రక్షణగా ఉంటుంది.
♦ ప్రతిరోజూ ఉదయాన్నే పక్షులకు తృణధాన్యాలను ఆహారంగా వేయండి. ఆర్థిక సమస్యలు శీఘ్రంగా తొలగిపోతాయి.
♦ గురువారం రోజున ఇష్టదైవానికి చెందిన గుడికి వెళ్లడం మాత్రమే కాదు, ఆ రోజున గురువులను, గురు సమానులను కలుసుకొని వారికి మీ శక్తి మేరకు దక్షిణ తాంబూలాదులను సమర్పించి, ఆశీస్సులు తీసుకోండి.
♦ పూజ కోసం వినియోగించే అగరొత్తులు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలను శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో కొనుగోలు చేయండి.
– పన్యాల జగ న్నాథదాసు