కొందరు తమ తమ రంగాల్లో ఎంతగా కృషి సాగిస్తున్నా వరుస అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. దీర్ఘకాలం ఇలాంటి పరిస్థితి కొనసాగడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రతిష్ఠ మసకబారుతుంది. ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. చివరకు ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ప్రతికూలతలను అధిగమించి, విజయాలు సాధించాలంటే...
♦ సూర్య ఆరాధన వల్ల అపజయాలు తొలగుతాయి. ఏదైనా ఆదివారం నుంచి ఆదిత్యహృదయం పఠించడం ప్రారంభించాలి. ప్రతిరోజూ పదకొండుసార్లు చొప్పున పదకొండు రోజుల పాటు అంతరాయం లేకుండా ఆదిత్యహృదయ పఠనం కొనసాగించాలి. సూర్య ప్రీతి కోసం పూజలో ఎర్రని పూలు ఉపయోగించాలి. రాగిపాత్రలో తీర్థాన్ని సమర్పించాలి.
♦ ఏదైనా సోమవారం లేదా శనివారం రోజున సూర్యోదయ వేళలో జమ్మిచెట్టు వేరును సేకరించాలి. ఆ వేరును శుభ్రపరచి పూజలో ఉంచాలి. పూజ ముగిసిన తర్వాత దానిని ఎరుపుదారంతో కట్టి మెడలో తాయెత్తులా ధరించాలి.
♦ పసుపు, కుంకుమపువ్వు ముద్దలా నూరి, దానిని పూజ సమయంలో తిలకంలా ధరించాలి.
♦ పేద బాలికలకు ఆర్థిక సహాయం చేయడం వల్ల ఫలితముంటుంది.
♦ చిన్న వెండిపూసలు రెండింటిని తయారు చేసి, వాటిని పూజలో ఉంచిన తర్వాత ఎల్లప్పుడూ పర్సులో భద్రపరచుకోవాలి.
– పన్యాల జగన్నాథదాసు
అన్నింటా అపజయాలా?
Published Sun, Jan 28 2018 1:56 AM | Last Updated on Sun, Jan 28 2018 1:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment