స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి | Sri Devi sarannavaratri celebrations | Sakshi
Sakshi News home page

స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి

Published Fri, Sep 30 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి

స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి

విజయాలను ప్రసాదించే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతియేడూ ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమినుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించటం  ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారి అలంకార విశేషాలు, పఠించవలసిన శ్లోకం, చేయవలసిన నివేదన, చేయడం వల్ల కలిగే ఫలాలు సాక్షి ఫ్యామిలీ పాఠకులకోసం రోజూ ప్రత్యేకంగా...
 
మొదటిరోజు - స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి
 శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మొదటిరోజు శనివారం అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి (శైలపుత్రి)గా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు.
 నివేదన: ఆవునేతితో చేసిన పొంగలి
 
ఈరోజు పఠించవలసిన శ్లోకం
     సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితే!
     యాని చాత్యుర్థ ఘోరాణి తై ర్మాస్మాంస్తథా భువమ్
 భావం: ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు!
 ఫలమ్: ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి.
 - దేశపతి అనంత శర్మ, పురోహితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement