విశ్వరూప వీరభద్రుడు | Story of veerabhadra swamy | Sakshi
Sakshi News home page

విశ్వరూప వీరభద్రుడు

Published Sun, Nov 18 2018 1:05 AM | Last Updated on Sun, Nov 18 2018 1:05 AM

Story of veerabhadra swamy - Sakshi

శివుడి జట నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడు. ఇక్కడ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఊరిబయట బయలు వీరభద్రస్వామిగా, ఆలయంలో జ్వాలా వీరభద్రుడిగా, పుష్కరిణికి దగ్గరలో ఆరామవీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద జటావీరభద్రుడిగా కనిపించే ఈ స్వామి మల్లికార్జున స్వామివారి ముఖమండపంలో ఎడమవైపు విశ్వరూపంతో దర్శనమిస్తారు. శివలింగ చిహ్నలాంఛితమైన కిరీటాన్ని తలపై ధరించి సర్వాభరణాలంకృతుడై, మోకాలివరకూ వేలాడే కపాలమాలతో, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో గొడ్డలి అదేవిధంగా కుడివైపు పదిహేను చేతులతో, ఎడమవైపు పదిహేను చేతులతో అనేక ఆయుధాలను ధరించి ఈ స్వామి కనిపిస్తాడు.

ఆయనకు కుడివైపు మేకతలతో దక్షుడు, ఎడమవైపు భద్రకాళి ఉంటారు. ముప్పై రెండు చేతుల వీరభద్రుని మయశిల్పగ్రంథం అఘోర వీరభద్రస్వామిగా కీర్తించింది. ఈ స్వామిని దర్శించుకోవడం వలన సకల కష్టాలు, శతృబాధలు తొలగి, సర్వ అభీష్టాలు నెరవేరుతాయని శైవాగమాలలో చివరిదైన వాతులాగమం చెప్పింది. తనను సేవించిన వారికి సకలైశ్వర్యాలను, సుఖాన్ని, భుక్తిని, ముక్తిని ఇస్తాడని మంత్రశాస్త్రగ్రంథాలు పేర్కొన్నాయి.
 

– డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement