వేళ్లకు గోరువెచ్చని నీళ్లుట
బ్యూటిప్స్
ఓ కప్పు నీళ్లలో కొద్దిగా పుదీనా వేసి మరిగించాలి. ఈ నీటిని వడగట్టి, కొంచెం నిమ్మరసం కలిపి చేతులకు రాసి బాగా రుద్దుకుని, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చేతులపై నలుపు పోయి చర్మం మెరుస్తుంది.ఆలివ్ నూనెలో పంచదార కలిపి రుద్దుకుంటే ఎండవల్ల కాళ్లు, చేతులపై ఏర్పడిన నల్లదనం పోతుంది.బేకింగ్ సోడాలో పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లు, చేతులకు పట్టించి... ఆరిన తర్వాత కడిగేసుకుంటే మురికి, మలినాలు పోయి చర్మం నిగనిగలాడుతుంది.
కలబంద గుజ్జులో తేనె కలిపి కాళ్లకు, చేతులకు ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. వారానికి ఒకసారైనా ఇలా చేస్తే... కాళ్లు, చేతులపై ఉండే చర్మం మృదువుగా, నిగారింపుతో ఉంటుంది.