
అదీ పాయింటే.. ఇదీ పాయింటే!
ఈ ఏనుగు పేరు మారా. అర్జెంటీనాలోని ఒక జూలో దప్పికతో నీళ్లు తాగుతోంది. దీంతో పాటు అదే జూలో మరో రెండు ఏనుగులున్నాయి. ఇటీవల అక్కడి కోర్టు జంతు ప్రేమికులు వేసిన వాజ్యంలో ఈ మూడు ఏనుగులను ఇంకొన్ని సౌకర్యాలతో చూసుకోవాలని జూ అధికారులకు ఆదేశించింది. అయితే వీటి తరఫున వాదిస్తున్న న్యాయవాది అసలు సహజమైన అడవుల్లో తిరగాల్సిన ఏనుగులు జూలో బందీ కావడం ఏంటని వెంటనే వాటిని స్వేచ్ఛగా వదిలిపెట్టాలని వాదనలు వినిపించాడు.
దీనికి జూ అధికారులు జవాబిస్తూ ‘అయ్యా! అవి జూలోనే పుట్టాయి. ఇక్కడే పెరిగాయి. వీటికి అడవిలో ఉండే పరిస్థితులు తెలియవు. స్వేచ్ఛ ప్రసాదిస్తే చచ్చూరుకుంటాయి’ అని అన్నారు. అదీ పాయింటే... ఇదీ పాయింటే గనుక న్యాయమూర్తి తల పట్టుకున్నాడు.