
ఆ నేడు 1963 సెప్టెంబర్ 26
ప్రజలందరికీ పన్నుపోటు
అగ్రరాజ్యమైన అమెరికా తనదేశ ప్రజలందరికీ పన్నుపోటు విధిస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో భాగంగా దేశంలో పని చేసే స్త్రీ పురుషులందరూ వయసుతో నిమిత్తం లేకుండా తమ ఆదాయంలో పదిశాతం తప్పనిసరిగా పన్ను చెల్లించవలసిందేనని ప్రకటిస్తూ, అమెరికన్ కాంగ్రెస్ చట్టం చేసింది.
అయితే కార్పొరేషన్ టాక్స్ నుంచి మాత్రం మినహాయింపు నిచ్చింది. ఆదాయ పన్ను సవరణ ద్వారా లభించిన అదనపు ఆదాయాన్ని దేశాభివృద్ధికి, సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థను గాడిన పడెయ్యడానికి ఉపయోగిస్తామని పేర్కొంది. 1963 సెప్టెంబర్ 26న అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆదాయ పన్ను చట్టంలోనే సంచలనాన్ని సృష్టించింది.