పేస్‌మేకర్‌కు కొత్త ఫేస్ | The pace of new Face mekar | Sakshi
Sakshi News home page

పేస్‌మేకర్‌కు కొత్త ఫేస్

Published Mon, Jul 7 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

పేస్‌మేకర్‌కు కొత్త ఫేస్

పేస్‌మేకర్‌కు కొత్త ఫేస్

ఆవిష్కరణ
 
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి పేస్‌మేకర్ ఓ వరం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఏడు లక్షలకంటే ఎక్కువమంది గుండె లయబద్ధంగా కొట్టుకోవడానికి పేస్‌మేకర్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ పేస్‌మేకర్‌ని అమర్చుకోవడం ఒక ఎత్తు. అయితే, ఏడెనిమిదేళ్ల తర్వాత దానిని రీప్లేస్ చేసుకోవడం చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియ అనే చెప్పాలి. ఈ శ్రమ ఇకపై ఉండదు అంటున్నారు మిషిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు.
 
డాక్టర్ అమిన్ కరామి బృందం గుండె కొట్టుకునేటప్పుడు విడుదలయ్యే విద్యుచ్ఛక్తి ఆధారంగా పేస్‌మేకర్ ఎప్పటికప్పుడు చార్జ్ అవుతూ ఉండేటట్లు కొత్తరకం పేస్‌మేకర్‌ను రూపొందించింది. చెవి దగ్గర అమర్చే చిన్న రేడియో ఈ పనిని నిర్వహిస్తుంది. ప్రయోగదశలో విజయవంతమైన ఈ పేస్‌మేకర్‌ను ఒకసారి అమర్చుకుంటే ఇక దానంతట అదే పనిచేస్తూ ఉంటుంది. ఇది మార్కెట్‌లోకి రావడానికి కనీసం మూడు- నాలుగేళ్లు పట్టవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement