discovery
-
ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో తెలుసా!
ఓ సూఫీ జ్ఞాని చెప్తున్నారు...మనిషి ఆత్మ భగవంతుడి నుంచి వచ్చింది. అది చివరకు భగవంతుడినే చేరుతుంది. అది అంతిమంగా భగవంతుడిని ఎప్పుడు చేరుతుందో అప్పుడే దాని ప్రయాణం ముగుస్తుంది. అప్పటి వరకూ అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అంటే అదొక వలయం. అనేక పుట్టుకలు, అనేక మార్గాలు ఇలా ఎలాగైనా అనుకోవచ్చు. చెప్పాలంటే జీవితంలో ఏదో ఒక అన్వేషణ అంటూ ఉంటూనే ఉంటుంది. మనసు ఏదో ఒకటి కోరుతూ ఆ దిశలో పయనిస్తుంది. కానీ అది ఏది కోరుకుంటుందోఎక్కడ తృప్తి చెందుతుందో స్పష్టత ఉండదు. దీనినే ఆ జ్ఞాని ఆత్మాన్వేషణ ప్రయాణం అని చెప్పారు. ఇదంతా వింటున్న ఓ శిష్యుడికి ఓ సందేహం కలిగింది. ‘‘గురువుగారూ, ఆత్మ అంతిమంగా భగవంతుడిని చేరుకోవడంతో దాని ప్రయాణం ముగుస్తుందన్నారు కదా... అంటే ప్రతి ఒక్కరూ భగవంతుడిని చేరుకోవడమే అవుతుందిగా’’ అని అడిగాడు. ‘‘అవును... అందులో సందేహమేముంది? కాస్తంత ముందు వెనుకలు అంతే..అంతకన్నా మరొకటి కాదు... అందరూ చివరికి భగవంతుడిని చేరుకోవలసిందే’’ అన్నారు జ్ఞాని. ‘‘మరి మత పెద్దలు కొందరు మాత్రమే భగవంతుడిని చేరుకుంటున్నారని చెప్పారుగా?’’ అన్నాడు శిష్యుడు. అప్పుడు జ్ఞాని ‘‘నువ్వో పని చెయ్యి. ఊళ్ళోకి వెళ్ళి, వీలున్నంతమందిని కలిసి వారి కోరికేమిటో తెలుసుకుని రా’’ అని సూచించారు. సరేనని శిష్యుడు కొన్ని కాగితాలు, కలం తీసుకుని ఊళ్ళోకి బయలుదేరాడు.అనేకమందిని కలిశాడు. వారు ఏం కావాలనుకుంటున్నారో, వారి లక్ష్యమేమిటో అడిగాడు. వారి మనసు ఏది పొందితే తృప్తి పడుతుందో చెప్పమన్నాడు. వారు చెప్పినవన్నీ రాసుకున్నాడు. జ్ఞాని వద్దకు వచ్చాడు. ‘‘అయ్యా, ఊళ్ళో రాజు మొదలుకుని కూలీవరకూ ఎందరినో కలిసాను. వారు చెప్పినదంతా చదువుతాను వినండి’’ అంటూ మొదలుపెట్టాడు... ‘‘రాజేమో మరిన్ని దేశాలను గెలవాలనుకున్నాడు. యువరాజేమో తెలివైన యువరాణిని పెళ్ళాడాలనుకున్నాడు... ధనవంతుడేమో మరింత డబ్బు గడించాలనుకుంటున్నాడు... ఇలా ఒక్కొక్కరూ ఆశ పడుతున్నారు...’’ చెప్తుండగానే జ్ఞాని చదవడం ఆపమన్నారు. ‘‘అదంతా పోనివ్వు... వారిలో ఎంతమంది భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మొదట చదువు’’ అన్నారు జ్ఞాని. ఒక్కరు కూడా లేరన్నాడు శిష్యుడు. ‘‘అంటే నువ్వు కూడా లేవా ఆ జాబితాలో?’’ అని అతనివంక నవ్వుతూ చూశారు జ్ఞాని. శిష్యుడు తల దించుకున్నాడు. – జగద్రేణు (చదవండి: మంగళకరం) -
హైదరాబాద్‌కు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. 1200 మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. నగరంలో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం న్యూయార్క్‌లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థను సందర్శించి సంస్థ ఫైనాన్స్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షురాలు అలెగ్జాండ్రా కార్టర్‌తో సమావేశమయ్యారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాభివృద్ధి, ఆవిష్కరణల విషయంలో ఇరువర్గాలు ఒకే విధమైన ఆశయాలను కలిగి ఉన్నట్టు ఈ చర్చల సందర్భంగా అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ రంగాల ఉజ్వల భవిష్యత్‌కి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. గొడుగు కింద ప్రఖ్యాత వినోద ఛానళ్లు.. వైవిధ్యభరిత కంటెంట్, బ్రాండ్స్, ఫ్రాంచైజీల ద్వారా టెలివిజన్, సినిమా, స్ట్రీమింగ్, గేమింగ్ వంటి రంగాల్లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రపంచ ఖ్యాతి గడించింది. సంస్థ గొడుగు కింద ప్రపంచ ప్రఖ్యాత హెచ్‌బీఓ, హెచ్‌బీఓ మ్యాక్స్, సీఎన్ఎన్, టీఎల్సీ, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, ఈరోస్పోర్ట్, అనిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్వర్క్, నిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్ వంటి ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. హైదారాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా భారతీయ మార్కెట్లోని అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు నగర మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలపై తనదైన ముద్ర వేయాలని వార్నర్ బద్రర్స్ డిస్కవరీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: 105 సీట్లు మనవే! చెప్పినట్టు పనిచేస్తే గెలుస్తం.. లేదంటే మునుగుతం వ్యూహాత్మక కేంద్రంగా సేవలు.. మన దేశంలో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ కార్యకలాపాలకు హైదరాబాద్‌లోని ఐడీసీ వ్యూహాత్మక కేంద్రంగా సేవలందించనుంది. తొలి ఏడాది 1200 వృత్తి నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించనుంది. వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచుకోనుంది. స్థానిక నిపుణులను ప్రోత్సహించడం, హైదరాబాద్ నగరంలో మీడియా, వినోద రంగ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాడు అందించడంలో సంస్థ చిత్తశుద్ధికి ఈ నిర్ణయం నిదర్శనమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టులపై ప్రసంగించనున్న కేటీఆర్ కాగా, వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న మంత్రి కె.తారకరామారావుకు అక్కడి ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు. ఈనెల 21 నుంచి 25 వరకు నెవాడాలోని హెండర్సన్లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్(ఏఎస్సీఈ) ఆధ్వర్యంలో జరగనున్న ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల సదస్సుకు కేటీఆర్ హాజరవుతున్నారు. తెలంగాణ పరివర్తనాత్మక ప్రాజెక్టులు – కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టుల గురించి సదస్సులో ప్రసంగించనున్నారు. వివిధ వాణిజ్య సమావేశాల్లోనూ కేటీఆర్ పాల్గొననున్నారు. Thrilled to announce the grand entry of global media powerhouse "Warner Bros. Discovery" into the entertainment realm of Telangana! Hyderabad is set to witness the launch of their incredible IDC, a hub of creativity and innovation, with a whopping 1200 employees in the first… pic.twitter.com/z5hAj5kBNs — KTR (@KTRBRS) May 17, 2023 -
ప్రైమ్‌వీడియోస్‌లో డిస్కవరీ ప్లస్ ఇంకా మరెన్నో..
Prime Video New Service : అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్న ప్రత్యేక సర్వీసుని అమెజాన్ ఇండియాలో కూడా ప్రవేశపెట్టింది. ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ఫార్మ్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ సర్వీసు గత శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ బూమ్ గత రెండేళ్లుగా ఇండియాలో ఓటీటీ బిజినెస్ ఊపందుకుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌వీడియోస్, హాట్‌స్టార్‌లకు తోడుగా అనేక సినిమా నిర్మాణ సంస్థలు, టీవీ ఛానల్లు సొంతంగా ఓటీటీలు నెలకొల్పాయి. పోటాపోటీగా ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. దీంతో నచ్చిన వీడియో కంటెంట్ చూడాలంటే అనేక ఓటీటీ యాప్‌లకు చందాదారులగా చేరాల్సి వస్తోంది. ఓకే ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియో వేదికగా ఇతర యాప్‌లను బండిల్ ఆఫర్‌గా అమెజాన్ అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తగా ఇప్పటికే 9 దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా ఇండియాలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. లాగిన్ సమస్యలుండవు వ్యక్తిగతంగా ఉపయోగించే ఈ మెయిల్ ఐడీల నుంచి పలు సోషల్ మీడియా అకౌంట్లు, ఫైనాన్షియల్ యాప్‌లు అన్నింటికీ వేర్వేరు యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు ఉంటున్నాయి. వీటికి తోడు పదుల సంఖ్యలో ఓటీటీ యాప్‌లు కూడా వచ్చి చేరాయి. ఈ పాస్వర్డ్లు, యూజర్ నేమ్‌ల గోల తప్పించేందుకు బండిల్ ఆఫర్‌ని అందిస్తున్నట్టు ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ గౌరవ్ గాంధీ తెలిపారు. బండిల్ ఆఫర్లో ఉన్నవి ఇవే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో బండిల్ ఆఫర్‌గా ముబీ, డోకుబే, డిస్కవరీ ప్లస్, లయన్స్‌గేట్ ప్లే, ఈరోస్ నౌ, షార్ట్స్ ప్లే, హోయ్‌చోయ్, మనోరమా మ్యాక్స్ వంటి ఇతర ఓటీటీ సేవలు ఉన్నాయి. అయితే ఈ సేవలను యాడ్ ఆన్ సబ్స్క్కిప్షన్ పద్దతిలో అందించారు. దీని ప్రకారం ఈ అదనపు వీడియో కంటెంట్ చూడాలంటే వేర్వేరుగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బండిల్ ఆఫర్లో భాగంగా వన్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్‌పై తగ్గింపును అందుబాటులో ఉంచారు. చదవండి : మొండి గూగుల్.. ఆ ఫోన్లలో కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా వేస్టే! ఎందుకంటే. -
ఓటీటీ ప్రియులకు ఇక పండగే!
ఓటీటీలో మూవీస్ చూసేవారికి పండుగ లాంటి వార్తా అమెజాన్ ప్రైమ్ చెప్పింది. భారతదేశంలో అమెజాన్ తన వ్యూహాత్మక చర్యలలో భాగంగా ప్రైమ్ వీడియో ఛానల్స్ ప్రారంభించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఎనిమిది సబ్ స్క్రిప్షన్ ఆధారిత ఒటీటీ యాప్స్ ప్రత్యేక కంటెంట్ ని ఇక నుంచి సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు అని తెలిపింది. డిస్కవరీ+, లయన్స్ గేట్ ప్లే, డోకూబాయ్, ఇరోస్ నౌ, ఎంయుబిఐ, హోయిచోయ్, మనోరమా మ్యాక్స్, షార్ట్స్ టివి వంటి స్ట్రీమింగ్ యాప్స్ కంటెంట్‌ని యాడ్ ఆన్ సబ్ స్క్రిప్షన్లతో ప్రైమ్ వీడియో సభ్యులు యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిన ఈ అన్ని యాప్స్ కొరకు సింగిల్ బిల్లింగ్ మెకానిజం ఉంటుంది. ప్రైమ్ వీడియో ఛానల్స్ నేటి (సెప్టెంబర్ 24) నుంచి ప్రారంభమవుతాయి. ప్రైమ్ వీడియో ఛానల్స్ ద్వారా డిస్కవరీ+, లయన్స్ గేట్ ప్లే, డోకుబే, ఎరోస్ నౌ, ఎంయుబిఐ, హోయిచోయ్, మనోరమాక్స్, షార్ట్స్ టివి వంటి ఎనిమిది వీడియో స్ట్రీమింగ్ యాప్స్ వేలాది షోలు, మూవీలు, రియాలిటీ టివి, డాక్యుమెంటరీలు మొదలైన వాటితో సహా గ్లోబల్, లోకల్ బింగే-వర్తీ కంటెంట్ ప్రైమ్ సభ్యులు చూడవచ్చు. అయితే, కస్టమర్లు తాము ఎంచుకున్న సేవలకు మాత్రమే డబ్బులు చెల్లించవచ్చు. ఈ ఎనిమిది ఒటీటీ ప్లాట్ ఫారమ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది గనుక, వినియోగదారులు తమకు ఇష్టమైన షోలను చూడటానికి ఇక ఈ ఎనిమిది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే, అన్నీ ఛానెల్స్ మధ్య సులభంగా స్విచ్ అవ్వవచ్చు. ప్రైమ్ వీడియో ఛానల్స్ ఓటిటి యాప్స్ సబ్ స్క్రిప్షన్ ధర డిస్కవరీ+ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.299 డోకుబే సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.499 ఇరోస్ నౌ సబ్ స్క్రిప్షన్ ధర రూ.299 హోయిచోయ్ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.599 లయన్స్ గేట్ ప్లే సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.699 మనోరమాక్స్ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.699 ఎంయుబిఐ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.1999 షార్ట్స్ టీవీ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.299 -
అదిరిపోయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ కొత్త వర్షన్..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) భారత మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ డిస్కవరీ కొత్త వెర్షన్‌ను బుధవారం రోజున విడుదల చేసింది. కొత్త డిస్కవరీలో న్యూ ఎల్ఈడీ హెడ్లైట్లు, టెయిల్ లైట్లు, ఫ్రెష్ ఫ్రంట్ రియర్ బంపర్లను అమర్చారు. అంతేకాకుండా కారు ఇంటిరీయర్స్‌లో న్యూ పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్తో 11.4 అంగుళాల హెచ్డి టచ్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్‌తో ఆధునాతన కనెక్టివిటీ కల్గి ఉంది. న్యూ డిస్కవరీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ వేరియంట్లతో రానుంది.కారులో స్ట్రెయిట్-సిక్స్ ఇంజినియం ఇంజన్లను ఏర్పాటు చేశారు. పెట్రోల్ వేరియంట్ 265 కిలోవాట్ల సామర్థ్యాన్ని, 500ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజీల్వేరియంట్ 221 కిలోవాట్ల సామర్థ్యాన్ని 650ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిస్కవరీ కొత్త వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ .88.06 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. డిస్కవరీ ఆధునాతన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో రానుంది. భారత్‌లో ల్యాండ్ రోవర్ శ్రేణిలో రేంజ్ రోవర్ ఎవోక్ (రూ .59.04 లక్షలు నుంచి), డిస్కవరీ స్పోర్ట్ (రూ .65.30 లక్షలు), డిఫెండర్ 110 (రూ .83.38 లక్షలు), రేంజ్ రోవర్ స్పోర్ట్ (రూ. 91.27 లక్షలు) రేంజ్ రోవర్ రూ. 2.10 కోట్లుగా ఉన్నాయి. జెఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ దర్శకుడు రోహిత్ సూరి మాట్లాడుతూ..కొత్త డిస్కవరీ, ల్యాండ్ రోవర్ కార్లలో తన సామర్ధ్యాన్ని నిలుపుకుంటూ, నూతన ఆవిష్కరణతో, లగ్జరీ లుక్‌ను అందిస్తోంది. అడ్వెంచరస్ ప్రయాణాలకు ఉత్తమమైన ఎస్యూవీ అని ఒక ప్రకటనలో తెలిపారు. -
జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్
జియో తన ఫైబర్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. భారత్ లో అత్యంత ప్రజాదరణ గల డిస్కవరీ ప్లస్ కంటెంట్‌ను జియో తన ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ భాగస్వామ్యం ద్వారా డిస్కవరీ ప్లస్ సైన్స్, అడ్వెంచర్, ఫుడ్, లైఫ్ స్టైల్ యానిమేషన్ వంటి కంటెంట్‌ను జియోఫైబర్ వినియోగదారులు ఉచితంగా ఆస్వాదించవచ్చు. డిస్కవరీ ప్లస్ ప్లాట్‌ఫాం ప్రేక్షకుల కోసం నాన్-ఫిక్షన్ కంటెంట్‌ను హోస్ట్ చేస్తుంది. ఈ స్ట్రీమింగ్ యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీతో సహా పలు భాషలలో కంటెంట్ అందిస్తుంది. కొత్త, ఇప్పటికే జియో ఫైబర్ వినియోగదారులు రూ.999తో పాటు దాని పై ప్లాన్ ఎంచుకుంటే మాత్రమే ఈ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. ఈ కొత్త భాగస్వామ్యం వల్ల జియోఫైబర్ కస్టమర్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఇంటూ ది వైల్డ్ సిరీస్‌తో సహా ఇతర డిస్కవరీ నెట్వర్క్ ప్రీమియం షోలు యాక్సెస్ చేయడానికి అవకాశం లభిస్తుంది. మ్యాన్ వర్సెస్ వైల్డ్, గోల్డ్ రష్, ఎక్స్‌పెడిషన్ అన్ నౌన్, 90 డే ఫైనాన్స్, హౌ ది యూనివర్స్ వర్క్స్ వంటి ప్రత్యేకమైన కంటెంట్ చూడవచ్చు. వీటితో పాటు జియోఫైబర్ వినియోగదారులు వందే భారత్ ఫ్లైట్ IX1344: హోప్ టు సర్వైవల్, సీక్రెట్స్ ఆఫ్ సినౌలి, మిషన్ ఫ్రంట్‌లైన్, సూపర్ సోల్, లడఖ్ వారియర్ తదితర సిరీస్ లను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే జియో 14 సంస్థలకు చెందిన ఓటిటీ కంటెంట్ ను ఉచితంగా అందిస్తుంది. ఇప్పడు ఆ జాబితాలో డిస్కవరీ ప్లస్ వచ్చి చేరింది. చదవండి: ఈ బ్యాంకు పాస్‌బుక్, చెక్‌బుక్‌లు ఏప్రిల్ 1 నుంచి చెల్లవు -
ఆనాటి పాములకు కాళ్లు
టొరంటో: పాములకు కోట్ల ఏళ్లక్రితం కాళ్లు ఉండేవని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. సుమారు పది కోట్ల ఏళ్ల క్రితం పాములకు దవడ ఎముకలు ఉండేవని పరిశోధకులు చెప్పారు. ఇప్పటి పాములకు దూరపు చుట్టమైన ‘నజష్ రియోనెగ్రినా’ అనే పురాతన సరీసృపం పుర్రె ఒకటి దొరకడంతో వీటి పరిణామ క్రమం అర్థం చేసుకునే వీలు ఏర్పడింది. హై రెజల్యూషన్ స్కాన్లతో ఈ పుర్రెను పరిశీలించినప్పుడు ఆనాటి సరీసృపం.. భూ దక్షిణార్ధ గోళంలో ఎక్కువగా కనిపించే ఒక రకం జాతి పాముల పూర్వరూపమని స్పష్టమైంది. కోట్ల ఏళ్ల క్రితం పాములు పెద్దసైజులో ఉండేవని అధ్యయనంలో తేలిందని, ఎక్కువగా వంగగలిగే పుర్రె సాయంతో భారీ సైజు ప్రాణులనూ ఆరగించగలిగేవని ఫ్లిండర్స్ యూనివర్శిటీ (ఆస్ట్రేలియా) శాస్త్రవేత్త అలెస్సాండ్రో పాల్కీ తెలిపారు. బల్లుల మాదిరిగా వీటి దవడ ఎముక పూర్తిగా ఏర్పడిందని చెప్పారు. -
కొత్త డిస్కవరీ స్పోర్ట్ ల్యాండ్‌మార్క్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) కంపెనీ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారును 2–లీటర్ల ఇంజినీయమ్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందించామని, ధర రూ.53.77 లక్షలని (ఎక్స్ షోరూమ్) అని జేఎల్ఆర్ తెలిపింది. ఈ కారులో స్పోర్టీ బంపర్, కార్పాథియన్ గ్రే కాంట్రాస్ట్ రూఫ్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నా యని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎమ్డీ, రోహిత్ సూరి తెలిపారు. -
అది రామసేతువే!
‘రామసేతు’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీరాముడు వానర సేన సాయంతో నిర్మించాడన్న వాదన ఒకవైపు.. వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమన్న వాదన మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికాకు చెందిన సైన్స్ చానెల్ ఒకటి మొదటి వాదననే సమర్ధిస్తూ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ.. ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని, మానవ నిర్మితమైనదేనని తేల్చింది. వివాదం పూర్వాపరాలతో కథనం.. రామాయణంలో ఉన్నట్లుగా తమిళనాడులోని పంబన్, శ్రీలంకలోని మన్నార్ దీవుల మధ్య దాదాపు 50 కిలో మీటర్ల దూరంపాటు సముద్రంలో నిజంగా శ్రీరాముడు వంతెన నిర్మించాడా? రామసేతువు, ఆడమ్ బ్రిడ్జి అని రెండు పేర్లు కలిగిన ఈ మార్గం సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే విషయాలు తాజాగా మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు కారణం అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన ‘సైన్స్ చానల్’ రూపొందించిన ఓ కార్యక్రమం. రామసేతువు నిజంగానే మానవ నిర్మితమేననడానికి ఆధారాలు ఉన్నాయని ఆ కార్యక్రమం చెబుతోంది. నాసా ఉపగ్రహాల చిత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించి తాము ఈ నిర్ధారణకు వచ్చామంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినదే కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలన్ లెస్టర్ అనే భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఈ కార్యక్రమంలో చెబుతున్నారు. రామసేతువును దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ, ఇది మానవుల అద్భుత నిర్మాణమని కార్యక్రమంలో సైన్స్ చానల్ పేర్కొంది. రామ సేతువు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, ఇసుక మాత్రం అంత పాతది కాదని తమ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్త చెల్సియా రోస్ చెప్పారు. ఐసీహెచ్ఆర్ ద్వారా పరిశోధన రామసేతువు నిర్మాణానికి కారణమైన ద్వీపాలు చారిత్రకంగా ఉన్నాయా లేక మానవనిర్మితాలా అన్న అంశాన్ని పరిశోధించే బాధ్యతను గతంలో భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్ఆర్)కు అప్పగించారు. ప్రస్తుతం ఈ పరిశోధన కొనసాగుతోంది. సేతు సముద్రం ప్రాజెక్టు భవితవ్యం గురించి ప్రభుత్వం చేసే ఆలోచనలపై తమ పరిశోధన ప్రభావం చూసే అవకాశం ఉందని ఈ ఏడాది మార్చి నెలలో ఐసీహెచ్ఆర్ చైర్మన్ వై. సుదర్శన్‌రావు అభిప్రాయపడ్డారు. రామసేతువు సహజసిద్ధమైనదా లేదా మానవనిర్మితమా అన్నది నిర్ధారించే అంశాలపై తాము దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. అయితే చరిత్రలోని క్రీ.పూ 4,000– క్రీ.పూ 1,000ల మధ్య కాలాన్ని ‘డార్క్ పీరియడ్’గా పరిగణిస్తున్నట్టు, అందువల్లే ఈ కాలాన్ని మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు సైన్స్ చానల్ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు మొదలుపెట్టింది. ఇందుకు కారణం గతంలో యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన వివరాలే. ప్రస్తుతం నౌకలు దేశ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి రావాలంటే శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. అందుకు కారణం రామసేతువు వంతెన ఉన్నట్లుగా భావిస్తున్న ప్రాంతంలో సముద్రం ఎక్కువ లోతు లేకపోవడమే. ఆ ప్రాంతంలో మట్టిని తవ్వి, సముద్రాన్ని మరింత లోతుగా చేస్తే నౌకలు అక్కడ నుంచే రాకపోకలు సాగించవచ్చనీ, తద్వారా 350 నాటికల్ మైళ్ల దూరం, దాదాపు 30 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించవచ్చంటూ అప్పట్లో కాంగ్రెస్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మిత్రపక్షం డీఎంకే వాదనతో కాంగ్రెస్ అంగీకరిస్తూ ‘అక్కడ వంతెన అనేదే లేదు. అది మానవనిర్మితం కాదు. ఒకవేళగతంలో ఎవరైనా దానిని నిర్మించి ఉంటే వారే దానిని నాశనం కూడా చేసి ఉండొచ్చు. రామసేతువు ఈ మధ్యే పూజ్యనీయ ప్రాంతంగా మారింది’ అని సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే ప్రజల విశ్వాసాలను గౌరవించాలని కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబల్ నాడు సుప్రీంకోర్టులో అన్నారు. మరోవైపు సీతను రక్షించేందుకు ‘రామసేతువు’ మార్గాన్ని శ్రీరాముడు సృష్టించాడన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసమనీ, అందువల్ల ఆ మార్గంలో ఉన్న ద్వీపాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ గట్టిగా వాదించింది. తాజాగా సైన్స్ చానల్ కథనం ఆధారంగా పలువురు బీజేపీ మంత్రులు కాంగ్రెస్‌పై విమర్శలు ప్రారంభించారు. ‘రామసేతువు అంశంపై బీజేపీ వైఖరి సరైనదేనని సైన్స్ ఛానల్ పరిశోధన నిరూపించింది. రామాయణంలో పేర్కొన్న మేరకు సీతను రక్షించేందుకు శ్రీరాముడు లంకకు వంతెనను నిర్మించాడనే ప్రజల విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ యూపీఏ పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వారిప్పుడు మాట్లాడాలి. మన సాంస్కృతిక వారసత్వంలో రామసేతువు ఒక భాగం’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ అన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ Are the ancient Hindu myths of a land bridge connecting India and Sri Lanka true? Scientific analysis suggests they are. #WhatonEarth pic.twitter.com/EKcoGzlEET — Science Channel (@ScienceChannel) December 11, 2017 -
జిల్లాస్థాయి సైన్స్‌కాంగ్రెస్ కరదీపిక ఆవిష్కరణ
విద్యారణ్యపురి : పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక మండలి సంయుక్తంగా ‘సుస్థిరాభివృద్ధికి విజ్ఞాన శాస్త్రం సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలు’ అంశంపై అక్టోబర్‌లో నిర్వహించే జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కరదీపికను డీఈఓ పి.రాజీవ్ హన్మకొండలోని డైట్ కళాశాలలో గురువారం ఆవి Ù్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఉన్నత పాఠశాలల బాలబాలికలు రూపొందించే ప్రాజెక్టులను గైడ్ చేసేందుకు ఉపాధ్యాయులకు ఈనెల 23న ఉదయం 10 గంటలకు ములుగు, జనగామ డివిజన్ ఉపాధ్యాయులకు, మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్, వరంగల్ డివిజన్ ఉపాధ్యాయులకు హన్మకొండలోని న్యూసైన్స్ పీజీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని వివరించారు. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి గైడ్ టీచర్ హాజరు కావాలన్నారు. తగిన సూచనలకు జిల్లా కోఆర్డినేటర్ రాంగోపాల్‌రెడ్డి (94924 47099), అకడమిక్ కోఆర్డినేటర్ గురునాధరావు (98665 49297)ను సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు తోట రవీందర్, యాదయ్య, సారంగపాణి అయ్యంగార్, సైన్స్ అధికారి సీహెచ్. కేశవరావు, రిసోర్స్ పర్సన్ కె.రామయ్య పాల్గొన్నారు. -
శతాబ్ధి ఆవిష్కరించిన నటుడాయన
'కొందరుంటారు.. కేవలం ప్రేక్షకులను రంజింపజేసేందుకు జన్మిస్తారు. వందేళ్లకు అలాంటివారు ఒక్కరో ఇద్దరో పుడతాడు. ఈ శతాబ్ధికైతే అలాంటి నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీనే. నా జన్మభూమికి సంబంధించిన కథలో ప్రధాన పాత్రధారిగా ఆయన నటన అసమానం. నా ఒళ్లు పులకించింది' అంటూ మాంఝీ సినిమాపై, ఆ చిత్రంలో ప్రధాన పాత్రధారి నవాజుద్దీన్ సిద్దిఖీపై ప్రశంసలజల్లు కురుపించారు కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్ అలనాటి హీరో శత్రుఘ్న సిన్హా. మాఝీ సినిమా చూస్తున్నంతసేపు ఆలోచనలు జన్మభూమి చుట్టూరా తిరిగాయని, తన స్వస్థలంలో బీహార్‌లో జరిగిన యదార్థగాథను దర్శకుడు కేతన్ మెహతా హృద్యంగా చిత్రీకరించారని సిన్హా అన్నారు. ఈ శతాబ్ధి ఆవిష్కరించిన నటుడంటూ.. మాంఝీ భార్య పాత్రలో రాధికా ఆప్టే నటన ప్రశంసనీయమంటూ శనివారం ఆయన ట్వీట్లు చేశారు. గయా జిల్లాలోని గెహలూర్ గ్రామానికి చెందిన దశరథ్ మాంఝీ.. ఒంటరిగా ఓ భారీ కొండను తవ్వి గ్రామానికి రహదారిని నిర్మించారు. 'మౌంటెయిన్ మ్యాన్' గా ప్రసిద్ధికెక్కిన ఆయన 2007లో మరణించారు. దశరథ్ మాంఝీ జీవితగాథనే 'మాంఝీ.. ది మౌంటెయిన్ మ్యాన్' సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు కేతన్ మెహతా. నిన్న (ఆగస్టు 21)న విడుదలైన ఈ చిత్రం పలువురి ప్రశంసలతో దూసుకెళుతోంది. దశరథ్ మాంఝీ పాత్రకు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆయన సతీమణి పగునియా పాత్రకు రాధికా ఆప్టే జీవం పోశారు. -
మరోసారి... టెన్ కమాండ్మెంట్స్!
డిస్కవరీ హాలీవుడ్ సినిమా ‘టెన్ కమాండ్మెంట్స్’(1923) ఆ రోజుల్లో నిశ్శబ్దంగా సాధించిన సంచలన విజయం అంతా ఇంతా కాదు. ఆ సినిమా విడుదలై తొంభై సంవత్సరాలు దాటినా దాని విశేషాల గురించి గొప్పగా మాట్లాడుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా ఆ సినిమా కోసం వేసిన భారీ సెట్ల గురించి. ఆ రోజులలో సినిమాకు సంబంధించిన సాంకేతికపరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఎంత పెద్ద నిర్మాణాన్ని అయినా భారీ సెట్స్‌గా వేసేవారు. అలా ‘టెన్ కమాండ్మెంట్స్’కోసం కాలిఫోర్నియాలోని వాడాలూపె సముద్ర తీరంలో ఎన్నో అందమైన భారీ సెట్లు వేశారు. విశేషమేమిటంటే, చా...లా కాలం తరువాత ‘టెన్ కమాండ్మెంట్స్’ కోసం వేసిన దేవాలయం సెట్లో కొంత భాగాన్ని, సింహిక (sphinx)ను ఆర్కియాలజిస్ట్‌లు వాడాలూపె సముద్ర తీరంలో కనుగొన్నారు. షూటింగ్ పూర్తి కాగానే చిత్రబృందం చాలా సెట్లను ధ్వంసం చేసింది. అయితే ఇప్పుడు బయటపడిన సెట్ మాత్రం పాక్షికంగానే ధ్వంసమై కాలక్రమంలో ఇసుకలో కూరుకుపోయింది. ‘‘పాత సినిమాలకు సంబంధించిన గొప్ప గొప్ప సెట్లను ఆనాటి వ్యక్తుల జ్ఞాపకాలు, పుస్తకాల్లో మాత్రమే గుర్తు చేసుకోగలం. ఇలా భౌతికంగా కనిపించడం మాత్రం చాలా అరుదైన సంఘటన’’ అంటున్నారు హిస్టారికల్ ఆర్కియాలజిస్ట్ కోలిన్ హమల్టిన్. తవ్వకాల్లో బయటపడిన ‘సింహిక’ను ప్రస్తుతం వాడాలుపె ‘డూనెస్ సెంటర్’ మ్యూజియంలో భద్రపరిచారు. ఆనాటి మరుపురాని సెట్లను వెలికితీయడానికి విరాళాలు కూడా సేకరిస్తున్నారు. తవ్వకాల్లో మరిన్ని సెట్లు, వాటి తాలూకు వస్తువులు బయటపడితే...ఇక వాటిని ‘డూనెస్ సెంటర్’లో భద్రపరచనక్కర్లేదు. ‘టెన్ కమాండ్మెంట్స్’ పేరుతో ఏకంగా ఒక మ్యూజియంనే ప్రారంభించవచ్చు! -
పేస్‌మేకర్‌కు కొత్త ఫేస్
ఆవిష్కరణ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి పేస్‌మేకర్ ఓ వరం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఏడు లక్షలకంటే ఎక్కువమంది గుండె లయబద్ధంగా కొట్టుకోవడానికి పేస్‌మేకర్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ పేస్మేకర్ని అమర్చుకోవడం ఒక ఎత్తు. అయితే, ఏడెనిమిదేళ్ల తర్వాత దానిని రీప్లేస్ చేసుకోవడం చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియ అనే చెప్పాలి. ఈ శ్రమ ఇకపై ఉండదు అంటున్నారు మిషిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు. డాక్టర్ అమిన్ కరామి బృందం గుండె కొట్టుకునేటప్పుడు విడుదలయ్యే విద్యుచ్ఛక్తి ఆధారంగా పేస్‌మేకర్ ఎప్పటికప్పుడు చార్జ్ అవుతూ ఉండేటట్లు కొత్తరకం పేస్‌మేకర్‌ను రూపొందించింది. చెవి దగ్గర అమర్చే చిన్న రేడియో ఈ పనిని నిర్వహిస్తుంది. ప్రయోగదశలో విజయవంతమైన ఈ పేస్‌మేకర్‌ను ఒకసారి అమర్చుకుంటే ఇక దానంతట అదే పనిచేస్తూ ఉంటుంది. ఇది మార్కెట్లోకి రావడానికి కనీసం మూడు- నాలుగేళ్లు పట్టవచ్చు. -
హెచ్ఐవీని నయం చేసే మెడిసిన్ వస్తోంది..!
హెచ్ఐవీ బాధితులకు శుభవార్త. ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు త్వరలో మందులు వచ్చే అవకాశాలున్నాయి. హెచ్ఐవీ వైరస్ పరిశోధనలో చైనా శాస్త్రవేత్తలు కీలకమైన పురోగతి సాధించారు. హెచ్ఐవీ బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి లేదా వ్యాధిని నయం చేయడానికి కొత్త ఔషధ ప్రయోగాలను అభివృద్దిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ఐవీ వైరస్ వ్యాప్తి సంబంధిత నిర్మాణాత్మకమైన విశ్లేషణలో పురోగతి కనబరిచినట్టు తెలిపారు. దీనిసాయంతో వ్యాధిని అరికట్టడం లేదా దీని ప్రభావం చాలా వరకు తగ్గించవచ్చని చైనాకు చెందిన ఓ వార్త సంస్థ వెల్లడించింది. పరిశోధనకు సంబంధించిన వ్యాసాన్ని సైన్స్ జర్నల్ వెబ్సైట్లో ప్రచురించారు. పరిశోధకుల బృందానికి ప్రొఫెసర్ హాంగ్ ఝీవీ నేతృత్వం వహిస్తున్నారు. హార్బిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్స్, టెక్నాలజీలో నిర్మాణత్మక అణుజన్యు జీవశాస్త్ర విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. 2012 మార్చిలో చైనా శాస్త్రవేత్తలు పరిశోధనకు శ్రీకారం చుట్టారు. 'ఎయిడ్స్ చికిత్సకు డ్రగ్ ఉత్పత్తిదారులు కొత్త రకమైన మందులు తయారు చేయడానికి పరిశోధక బృందం సహకరిస్తోంది. మెడిసిన్ తయారయ్యాక ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ చికిత్సలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. పూర్తిగా నయం కూడా చేస్తుందని ఆశిస్తున్నా' అని హాంగ్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 3.5 కోట్లమంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులున్నారు.