పొరలు పొరలుగా శిఖరాలుగా, పాయలు పాయలుగా సెలయేళ్లుగా ప్రపంచమంతా ప్రేమమయమే. ఎవరు ఏ అంచెలో, ఏ శ్రేణిలో, ఏ పొరలో, ఏ పాయలో ఉన్నారన్న దాన్ని బట్టే ప్రేమకు నిర్వచనం ఉంటుంది. అన్నిటికన్నా అధమమైన ప్రేమ ఆధిక్య ప్రేమ. ఆధిక్యంతో ఎప్పుడైతే ప్రేమ కలుషితమైపోతుందో అది ఇక ప్రేమ కానే కాదు. వట్టి స్వార్థం. ఆధిక్య భావన ప్రేమను విరిచేస్తుంది. అన్నిటికన్నా అత్యున్నతమైన ప్రేమ ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్న ప్రేమ.
బుద్ధభగవానుని ప్రేమ, జీసెస్ ప్రేమ, శ్రీకృష్ణుని ప్రేమ ఈ స్థితిలోనిదే. పైన వేరే ఇంకేం లేవు. బుద్ధుడు ఈ ప్రపంచాన్నంతటినీ ప్రేమించాడు. సృష్టి యావత్తుకూ పంచి ఇచ్చినా ఇంకా పట్టలేనంత ప్రేమ ఆయనలో ఉంది. అందుకే తన ప్రేమను చెట్లకు, పక్షులకు, మూగ ప్రాణులకు పంచాడు. ‘నిన్ను నువ్వు విశ్వసించకుండా, దేవుడిని విశ్వసించలేవు’ అని స్వామీ వివేకానంద అంటారు. విశ్వాసం నుంచి మొదలయ్యే ప్రేమ ఆధ్యాత్మికంగా బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికంగా బలమైనవారు ద్వేషంలోనూ ప్రేమనే చూస్తారు. ప్రేమనే పొందుతారు. ప్రేమనే తిరిగి ఇస్తారు.
పట్టలేనంత ప్రేమ
Published Sat, Dec 16 2017 12:21 AM | Last Updated on Sat, Dec 16 2017 12:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment