ఎన్ని సంపదలు ఉన్నా, ఇంట్లో పిల్లలు లేకపోతే లోటుగానే ఉంటుంది. కొందరికి పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగదు. ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుంటారు. అంతా బాగున్నట్లే వైద్యులు చెబుతారు. అయినా, కడుపు పండటం కష్టమవుతుంది. సంతానం కోసం వ్రతాలు, ఉపవాసాలు చేస్తున్నా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు పాటించాల్సిన కొన్ని పరిహారాలు...
♦ నిత్యపూజలో ప్రతిరోజూ వినాయకుడిని ప్రత్యేకంగా పూజించాలి. ఉదయం పూట ముందుగా శునకాలకు ఆహారం తినిపించి, ఆ తర్వాతే ఏదైనా తినాలి
♦ సంతాన గోపాలుని ఆరాధన వల్ల కూడా ఫలితం ఉంటుంది. గురువుల వద్ద సంతాన గోపాలమంత్రం ఉపదేశం పొంది, నియమబద్ధంగా జపించాలి
♦ నైరుతి దిశలో పడక గది ఉండేలా చూసుకోవాలి. కుదరకపోతే, దంపతులు శయనించే మంచాన్ని నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అయితే, గర్భం దాల్చిన తర్వాత మాత్రం గర్భిణులు నైరుతి గదిలో శయనించరాదు
♦ ఇంటి నడిమధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఆ ప్రదేశాన్ని ఎల్లప్పుడూ ఖాళీగానే ఉంచాలి. ఎలాంటి వస్తువులను ఉంచకూడదు
♦ ఏదైనా గురువారం సూర్యోదయ సమయంలో దురదగొండి మొక్క వేర్లు సేకరించి, వాటిని శుభ్రపరచి తాయెత్తులో ఉంచి ఎర్రదారంతో దంపతులిద్దరూ మెడలో ధరించాలి.
– పన్యాల జగన్నాథదాసు
నట్టింట్లో పాపాయి పారాడాలంటే...
Published Sun, Jan 7 2018 1:35 AM | Last Updated on Sun, Jan 7 2018 3:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment