
ఆంధ్రా షేక్‌స్పియర్‌గా, అభినవ కాళిదాసుగా ఎనలేని గుర్తింపు పొందిన సాక్షి వ్యాసాల రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావు చక్కటి హాస్యప్రియులు. ఆయన జీవిత చరమాంకంలో జరిగిన ఉదంతం ఇది. ఆ సమయంలో వృద్ధాప్య సమస్యలు ఆయన్ని వెంటాడుతున్నాయి. అలాంటి రోజుల్లో– ఓ సాహిత్య సమాజం వారు పానుగంటి వారికి భారీఎత్తున సత్కారం చేశారు. సభకు అధ్యక్షత వహించిన ఆ సమాజ నిర్వాహకుడు, చంద్రునికో నూలుపోగులా పానుగంటి వారికి బహుమతులు అందజేస్తున్నామని ఉత్సాహంతో ప్రకటించారు. దానికి పానుగంటి స్పందిస్తూ, ‘ఉన్న ఒక్క మతి పోయింది. దానికే ఇబ్బంది పడుతుంటే నాకు బహుమతులేల?’ అనేసరికి సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది.
- వాండ్రంగి కొండలరావు
Comments
Please login to add a commentAdd a comment