చర్మాన్ని ఎర్రబార్చే ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’! | Vancomycin skin tests and prediction of "red man syndrome" | Sakshi
Sakshi News home page

చర్మాన్ని ఎర్రబార్చే ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’!

Published Mon, May 9 2016 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

చర్మాన్ని ఎర్రబార్చే ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’!

చర్మాన్ని ఎర్రబార్చే ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’!

మెడిక్షనరీ
ఈ రుగ్మత పేరే ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’. దీన్నే రెడ్ నెక్ సిండ్రోమ్ అని కూడా అంటారు. చిత్రమైన పేర్లు ఉన్న రుగ్మతలలో ఒకటైన ఇది ‘వ్యాంకోమైసిన్’ అనే యాంటీబయాటిక్ మందు సరిపడకపోవడం వల్ల వస్తుంది. కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారికి ఈ వ్యాంకోమైసిన్ అనే యాంటీబయాటిక్‌ను డాక్టర్లు సూచిస్తుంటారు. ఇక కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు, రక్తం ఇన్ఫెక్షన్లలోనూ ఈ మందు వాడుతుంటారు. వ్యాంకోమైసిన్ తీసుకున్న వెంటనే చర్మంపై రియాక్షన్ కనిపిస్తుంది.

చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఇక కొందరిలో కండరాలను రిలాక్స్ చేసే మందులు వాడినా, తలకు వేసే రంగుల వల్ల కూడా ఈ ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ కనిపించే అవకాశాలు ఉంటాయి. చర్మం ఎర్రబడటంతో పాటు వికారం, వాంతులు, బీపీ తగ్గడం, గుండె స్పందనల వేగం పెరగడం, జ్వరం, వణుకు వంటి లక్షణాలూ కనిపించవచ్చు. వ్యాంకోమైసిన్ వాడుతున్నప్పుడు ఈ రుగ్మత కనిపిస్తే డాక్టర్లు వెంటనే ఆ మందును ఆపేస్తారు. యాంటీహిస్టమైన్స్‌తో చికిత్స చేస్తారు. అయితే ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ అంత ప్రమాదకరమైనది కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement