Red Man Syndrome
-
ఈమె.. మానవ 'పాము'..!
-
ఈమె.. మానవ 'పాము'..!
- ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి కుబుసం విడుస్తున్న షాలిని - వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన స్పెయిన్‌లోని ఓ ఆసుపత్రి సాక్షి, ఛత్తర్పూర్: బాధలతో బతుకీడ్చడం కన్నా.. నాలుగు గోళీలు మింగి ప్రాణాలు తీసుకోవడం నయం.. కన్న కూతురి బాధను చూస్తున్న తల్లి గుండెకోత నుంచి వచ్చిన మాట అది. పేగు తెంచుకుని లోకాన్ని చూసిన నాటి నుంచి తన కూతురు నరకం అనుభవిస్తోందని షాలిని తల్లి దేవాంకుర్ కంటతడి పెట్టుకున్నారు. నిజానికి ఆమె కంటి నుంచి రావడానికి ఏమీ లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీరంతా ఆవిరైపోయింది. దేవాంకుర్, రాజ్ బహదూర్లు భార్యభర్తలు. వీరి స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నౌవ్‌గాంగ్ అనే కుగ్రామం. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. వీరికి లేక లేక పుట్టిన సంతానం షాలిని. షాలిని పుట్టుక వారిలో ఆనందాన్ని నింపలేదు. వారి జీవితాలను మరింత బాధల్లోకి నెట్టింది. కారణం షాలిని శరీరం పాము పొలుసుల్లా ఉండటం. ఆమె శరీరం నుంచి ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి చర్మం రాలిపోయి మళ్లీ వస్తుంటుంది. రోజులో గంటకోసారి స్నానం, మూడు గంటలకోసారి మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను షాలిని శరీరమంతా రాసుకుంటుంది. లేకపోతే పొలుసుల చర్మం తేమ కోల్పోయి మంట పెడుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా గత పదహారేళ్లుగా షాలిని అమ్మ దేవాంకుర్ కూతురిని ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. తొలుత ఓ మీడియా సంస్థ షాలిని దురావస్థను వెలుగులోకి తెచ్చింది. దీంతో స్థానిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఆమె 'రెడ్ మ్యాన్ సిండ్రోమ్' అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. వైద్యం చేయించేందుకు భారీగా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో షాలిని తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి సుడులు తిరిగాయి. దీంతో ఆసుపత్రి నుంచి వెనుదిరిగి ఇల్లు చేరారు. రెండు రోజుల అనంతరం వారికి ఓ ఫోన్ వచ్చింది. స్పెయిన్‌లోని ఓ ఆసుపత్రి షాలినికి ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిందనే శుభవార్త తెలిసింది. దీంతో షాలిని ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. షాలిని తర్వాత దేవాంకుర్, రాజ్ బహదూర్ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. -
చర్మాన్ని ఎర్రబార్చే ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’!
మెడిక్షనరీ ఈ రుగ్మత పేరే ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’. దీన్నే రెడ్ నెక్ సిండ్రోమ్ అని కూడా అంటారు. చిత్రమైన పేర్లు ఉన్న రుగ్మతలలో ఒకటైన ఇది ‘వ్యాంకోమైసిన్’ అనే యాంటీబయాటిక్ మందు సరిపడకపోవడం వల్ల వస్తుంది. కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారికి ఈ వ్యాంకోమైసిన్ అనే యాంటీబయాటిక్‌ను డాక్టర్లు సూచిస్తుంటారు. ఇక కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు, రక్తం ఇన్ఫెక్షన్లలోనూ ఈ మందు వాడుతుంటారు. వ్యాంకోమైసిన్ తీసుకున్న వెంటనే చర్మంపై రియాక్షన్ కనిపిస్తుంది. చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఇక కొందరిలో కండరాలను రిలాక్స్ చేసే మందులు వాడినా, తలకు వేసే రంగుల వల్ల కూడా ఈ ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ కనిపించే అవకాశాలు ఉంటాయి. చర్మం ఎర్రబడటంతో పాటు వికారం, వాంతులు, బీపీ తగ్గడం, గుండె స్పందనల వేగం పెరగడం, జ్వరం, వణుకు వంటి లక్షణాలూ కనిపించవచ్చు. వ్యాంకోమైసిన్ వాడుతున్నప్పుడు ఈ రుగ్మత కనిపిస్తే డాక్టర్లు వెంటనే ఆ మందును ఆపేస్తారు. యాంటీహిస్టమైన్స్తో చికిత్స చేస్తారు. అయితే ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ అంత ప్రమాదకరమైనది కాదు.