ఈమె.. మానవ 'పాము'..! | 'Human snake' teen who sheds her skin every six weeks because of ultra-rare condition to get miracle treatment | Sakshi
Sakshi News home page

ఈమె.. మానవ 'పాము'..!

Published Sat, Sep 9 2017 8:56 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

ఈమె.. మానవ 'పాము'..! - Sakshi

ఈమె.. మానవ 'పాము'..!

- ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి కుబుసం విడుస్తున్న షాలిని
- వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన స్పెయిన్‌లోని ఓ ఆసుపత్రి

సాక్షి, ఛత్తర్‌పూర్‌‌: బాధలతో బతుకీడ్చడం కన్నా.. నాలుగు గోళీలు మింగి ప్రాణాలు తీసుకోవడం నయం.. కన్న కూతురి బాధను చూస్తున్న తల్లి గుండెకోత నుంచి వచ్చిన మాట అది. పేగు తెంచుకుని లోకాన్ని చూసిన నాటి నుంచి తన కూతురు నరకం అనుభవిస్తోందని షాలిని తల్లి దేవాంకుర్‌ కంటతడి పెట్టుకున్నారు.

నిజానికి ఆమె కంటి నుంచి రావడానికి ఏమీ లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీరంతా ఆవిరైపోయింది. దేవాంకుర్‌, రాజ్‌ బహదూర్‌లు భార్యభర్తలు. వీరి స్వస్థలం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నౌవ్‌గాంగ్‌ అనే కుగ్రామం. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. వీరికి లేక లేక పుట్టిన సంతానం షాలిని. షాలిని పుట్టుక వారిలో ఆనందాన్ని నింపలేదు. వారి జీవితాలను మరింత బాధల్లోకి నెట్టింది.

కారణం షాలిని శరీరం పాము పొలుసుల్లా ఉండటం. ఆమె శరీరం నుంచి ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి చర్మం రాలిపోయి మళ్లీ వస్తుంటుంది. రోజులో గంటకోసారి స్నానం, మూడు గంటలకోసారి మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ను షాలిని శరీరమంతా రాసుకుంటుంది. లేకపోతే పొలుసుల చర్మం తేమ కోల్పోయి మంట పెడుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా గత పదహారేళ్లుగా షాలిని అమ్మ దేవాంకుర్‌ కూతురిని ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement