నందీశ్వరుడు రంకె వేసే స్థలమేది? | Visiting a place called my application? | Sakshi
Sakshi News home page

నందీశ్వరుడు రంకె వేసే స్థలమేది?

Published Thu, Dec 4 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

నందీశ్వరుడు  రంకె వేసే స్థలమేది?

నందీశ్వరుడు రంకె వేసే స్థలమేది?

కలియుగాంతాన ఓ క్షేత్రంలోని నందీశ్వరుడు (బసవన్న) రంకె వేస్తాడని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో వివరించారు. ఆ క్షేత్రం ఎక్కడ ఉంది?
 - విశ్వంతరాజు, ఈ-మెయిల్
 
కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో బనగానపల్లి గ్రామానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం ఉంది. ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ క్షేత్రంలో ఉమా మహేశ్వర స్వామి వార్లు ఒకే శిలలో వెలిశారు. అగస్త్య మహాముని ఈ స్వామి వార్లను ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి.
 
నరసింహ స్వామి మానవ శరీర రూపంగా దర్శనమిస్తున్న క్షేత్రమేది? అదెక్కడుంది?
 - ఆర్.వి.వి, హైదరాబాద్
 
నరసింహ స్వామి మానవ శరీర రూపంగా దర్శనమిస్తున్న క్షేత్రం మల్లూరు. వరంగల్ జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రం పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. మల్లూరు గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో హేమాచలం ఉంది. ఈ పర్వతం మీద నరసింహ స్వామి వెలిశాడు. కనుక ఈ స్వామిని హేమాచల నరసింహస్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామి వారి విగ్రహానికి రోమాలు వుంటాయి, స్వామి వారి మూర్తి మెత్తగా ఉంటుంది. ఏటా ఇక్కడ పెద్ద గిరిజన జాతర జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండో పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కింది.
 
నాగదోషాల నివారణకు పేరెన్నికగన్న క్షేత్రమేది? ఎలా చేరుకోవాలి?
 - ఎన్.బి.వసంత, ఇ-మెయిల్
 నాగదోషాల నివారణకు పేరెన్నికగన్న క్షేత్రం కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలో, బెంగళూరు నగరానికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మూడు ముఖ్యమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రముఖమైనది. దట్టమైన వనాల మధ్య అలరారే ఈ క్షేతంలో అన్ని సదుపాయాలూ ఉన్నాయి.
 - దాసరి దుర్గాప్రసాద్, ట్రావెల్ ఎక్స్‌పర్ట్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement