దద్దరిల్లిన జనగర్జన
తిక్క లెక్క
ఒక మనిషి బిగ్గరగా కేకపెడితేనే విన్నవాళ్లకు గుండెలదురుతాయి. ఏకంగా ఒక జనసమూహం మూకుమ్మడిగా గర్జిస్తే... దిక్కులదిరిపోవూ! అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉన్న ఏరోహెడ్ స్టేడియంలో కొందరు క్రీడాభిమానులు ఎనిమిది సెకన్ల పాటు బిగ్గరగా అరిచి గిన్నెస్ రికార్డును బద్దలు కొట్టారు. కాన్సాస్ సిటీ చీఫ్స్, న్యూ ఇంగ్లాండ్ పాట్రియాట్స్ జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కాన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు ఘన విజయం సాధించింది.
దీంతో ఆ జట్టు అభిమానులు హర్షాతిరేకాలతో మూకుమ్మడి సింహనాదం చేశారు. దాని శబ్దం 142.2 డెసిబల్స్‌గా రికార్డయింది. సాధారణంగా 70 డెసిబల్స్ దాటిన శబ్దాలను తట్టుకోవడం కష్టం. మరి ఆ మూకుమ్మడి సింహనాదాన్ని విన్న వాళ్ల పరిస్థితి ఏమై ఉంటుందో ఊహించుకోవాల్సిందే!