చారాణా ఆవిష్కరణ
వహీద్‌ఖాన్ కథల సంపుటి ‘చారాణా’ ఆవిష్కరణ సెప్టెంబర్ 26న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఆవిష్కర్త: అంపశయ్య నవీన్. భూపతి వెంకటేశ్వర్లు, పరిమళ్, మోతుకూరి నరహరి, కవి యాకూబ్, ఆనందాచారి, వల్లభాపురం జనార్దన పాల్గొంటారు. నిర్వహణ: తెలంగాణ సాహితి.
పురస్కారాల ప్రదానం
కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో– సెప్టెంబర్ 27న సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని హోటల్ ఐలాపురంలో 2016, 17 సంవత్సరాలకుగానూ ఈ పురస్కారాల ప్రదానం వీరికి జరగనుంది. మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా పురస్కారం: శలాక రఘునాథ శర్మ, ఎస్.గంగప్ప. ఆలూరి బైరాగి సాహిత్య పురస్కారం: రసరాజు, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు. గుత్తికొండ సుబ్బారావు సాహితీసేవా పురస్కారం: కాలనాథభట్ట వీరభద్రశాస్త్రి, దంటు సూర్యారావు. ముక్కామల నాగభూషణం పాత్రికేయ పురస్కారం: ఈడ్పుగంటి నాగేశ్వరరావు, నెల్లూరు డోలేంద్ర ప్రసాద్. పోలవరపు కోటేశ్వరరావు కథా పురస్కారం: పి.సత్యవతి, కన్నెగంటి అనసూయ. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, దీర్ఘాశి విజయభాస్కర్ పాల్గొంటారు.
కలేకూరి ప్రత్యేక సంచిక
కలేకూరి ప్రసాద్(యువక) జయంతి సందర్భంగా భీమ్‌భూమి మాసపత్రిక ప్రత్యేక సంచిక తేనుంది. కలేకూరి మీద వ్యాసాలను అక్టోబర్ 2లోగా అను 7.0లో పంపాల్సిందిగా తంగిరాల సోని కోరుతున్నారు. ఫోన్: 9676609324. మెయిల్: sonytangirala@gmail.com
2017 గురజాడ పురస్కారాలు
జగత్ పూర్ణ విద్యాసమాజం– కురుపాం వారి ‘2017 గురజాడ పురస్కారా’లను అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు విశాఖ పౌర గ్రంథాలయంలో చింతకింది శ్రీనివాసరావు, వెలుగు రామినీయుడుకు ప్రదానం చేయనున్నారు. కె.ఎస్.చలం, వి.ఉమామహేశ్వరరావు, చందు సుబ్బారావు, మంతిని పార్వతీశం నాయుడు పాల్గొంటారు.