ఏమి టీ?
స్టడీ
ఇంతకీ ‘టీ’ తాగడం మంచిదేనంటారా?
‘దానిదేముంది. మంచిదే’ అనే మాట వినబడగానే టీ కప్పు కేసి చూస్తాము. దాని దగ్గరకు ఇంకా వెళ్లకుండానే..‘టీ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరిక రీసౌండ్‌లో వినిపిస్తుంది.
ఇంతకీ ‘టీ’ తాగడం మంచిదా? కాదా?
ఫ్రామింగమ్ యూనివర్శిటీ(యుఎస్)కి చెందిన పరిశోధకులు చెప్పేదాని ప్రకారం...‘టీ’ తాగడం మంచిదే. ఎందుకంటే... రోజుకు మూడు కప్పుల టీ సేవనం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.
‘‘చాలామంది పేవరెట్ డ్రింక్ టీ. దానివల్ల యాంటి-డయాబెటిక్ బెనిఫిట్లు ఉంటాయి. గుండెకు, రక్తప్రసరణ వ్యవస్థకు కూడా టీ సేవనం మంచిది’’ అంటున్నారు పరిశోధకుడు డా.టిమ్ బాండ్.