రెండు కాళ్ల మీద కూర్చుని రెండు చేతులు నమస్కార ముద్ర స్థితిలో ఉండడాన్ని నమస్కార ఆసనం అంటారు.
ఇలా చేయాలి !
ముందుగా రెండు కాళ్లమీద కూర్చుని రెండు పాదాలు భూమి మీద పూర్తిగా ఉంచి రెండు అరచేతులు మోకాళ్ల మీద ఉంచి కూర్చోవాలి. పాదాల మునివేళ్ల మీద లేచిన స్థితిలో ఉండాలి.
ఇప్పుడు రెండు చేతులను నమస్కార ముద్రలో తీసుకోవాలి. ఈ స్థితిలో రెండు మోకాళ్లని రెండు మోచేతులతో రెండు వైపులకూ నెట్టుతున్నట్లు ఉంటాయి.
ఈ స్థితిలో శరీర భారం పూర్తిగా మునివేళ్ల మీదనే ఉంటుంది. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి ఆ తర్వాత యథాస్థితికి రావాలి. రోజుకు మూడు నుంచి ఐదుసార్లు ఉదయం, సాయంత్రం సాధన చేయాలి.
మరొక విధానం
మునివేళ్ల మీద ఉండలేని వాళ్లు పాదాలను నేలకు పూర్తిగా ఆనించి ఆసనాన్ని సాధన చేయవచ్చు. అలాగే కొంతసేపు మునివేళ్ల మీద, కొంతసేపు పాదాల మీదకు మార్చుకుంటూ సాధన చేయవచ్చు.
ఉపయోగాలు
స్త్రీలు గర్భం ధరించిన నాటి నుంచి ప్రసవించే వరకు ఈ ఆసనాన్ని సాధన చేయవచ్చు ఊ సుఖప్రసవం కావడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది ఊ పునరుత్పత్తి వ్యవస్థ చైతన్యవంతమవుతుంది ఊ రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయి
గర్భకోశ వ్యవస్థను గర్భధారణకు సిద్ధం చేస్తుంది
మగవారికి లైంగిక శక్తి పెరుగుతుంది ఊ మోకాళ్ల నొప్పులు తొలగిపోతాయి. కాళ్ల కండరాలు, తొడల కండరాలు, పాదాలు శక్తిమంతం అవుతాయి ఊ ఏకాగ్రత పెరుగుతుంది.
జాగ్రత్తలు
మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నప్పుడు చేయకూడదు.
పాదాలు, కాళ్లకు సంబంధించి గతంలో ఫ్రాక్చర్స్ జరిగి ఉంటే వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు
అధిక బరువు ఉన్నవాళ్లు చేయకూడదు.
మోడల్: ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్
ఫొటోలు: శివ మల్లాల
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు
సప్తరుషి యోగవిద్యాకేంద్రం
హైదరాబాద్
నమస్కారాసనం
Published Mon, Jan 13 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement