ఈ వారం యూట్యూబ్ హిట్స్ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Sun, Jul 17 2016 11:20 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఈ వారం యూట్యూబ్ హిట్స్ - Sakshi

ఈ వారం యూట్యూబ్ హిట్స్

కేటీ పెర్రీ - రైజ్ : ఒలింపిక్ వీడియో
నిడివి : 3 ని. 20 సె. హిట్స్ : 73,07,493

 
కేటీ పెర్రీ (కేథరీన్ ఎలిజబెత్ హడ్సన్) అమెరికన్ గాయని. గేయ రచయిత్రి. నటి. బాల్యంలో చర్చిలో పాటలు పాడిన కేటీ టీనేజ్‌లో దేవగానాన్ని (గాస్పెల్ మ్యూజిక్)ని తన కెరీర్‌గా మలుచుకున్నారు. 2008లో 24వ యేట ‘ఐ కిస్డ్ ఎ గర్ల్’ ఆల్బమ్‌తో ప్రపంచాన్ని షేక్ చేసిన కేటీ తాజాగా ‘రైజ్’ అనే స్ఫూర్తిదాయకమైన ఒలింపిక్ గీతాన్ని విడుదల చేశారు. ‘ఐ వోంట్ జస్ట్ సర్వైవ్.. ఓహ్, యు విల్ సీ మీ థ్రైవ్’ అంటూ మొదలయ్యే ఈ గీతం.. జస్ట్ ఫైట్ ఇట్, జస్ట్ ఫైట్ ఇట్.. డోన్ట్ బి సర్‌ప్రైజ్డ్.. ఐ విల్ స్టిల్ రైజ్’ అంటూ పూర్తవుతుంది. పాటలోని అర్థం, అంతర్థాం, జీవనం వేదం... అంతా ఒక దేవరాగం. ఒక మహిమ గానం. వీడియోలోని ప్రతి ఫ్రేమ్‌లో క్రీడాకారులు ఉత్తేజంతో, ఉద్వేగంతో క్రీడా విన్యాసాలను జీవిత విన్యాసాల్లా ప్రదర్శించడం... ఒక అత్యద్భుత సన్నివేశంలా అనిపిస్తుంది. ప్రేరణ కలిగిస్తుంది.
 
జానేమన్ : వీడియో సాంగ్
నిడివి : 2 ని. 17 సె. హిట్స్ : 52,55,948

రోహిత్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న బాలీవుడ్ అడ్వెంచరస్ మూవీ ‘డిష్యూం’లోని వీడియో సాంగ్ ఇది. నాలుగు రోజుల క్రితం టీ సీరీస్ విడుదల చేసిన ఈ సాంగ్.. యూత్‌ని యూట్యూబ్‌కి కట్టిపడేస్తోంది! వరుణ్ ధావన్, పరిణితి చోప్రా.. వీళ్లిద్దరి చుట్టూ ఓ పెద్ద గుంపుతో రిథమిక్‌గా సాగే జానేమన్ సాంగ్‌కు సంగీతాన్ని ప్రీతమ్ అందించారు. సాహిత్యం మయూర్ పూరి. గానం అంతర మిత్ర, అమన్ త్రిఖా. జూలై 29న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహాం, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, అక్షయ్‌ఖన్నా ప్రధాన తారాగణం. కథ తెలిసిందే. మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)లో ఇండియా పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ మొదలు కాబోయే ముందు టాప్ బ్యాట్స్‌మన్ కనబడకుండా పోతారు! వాళ్లను పట్టి తెచ్చేందుకు అరేబియా సముద్రానికి ఇరువైపుల నుంచి ఇద్దరు పోలీసు అధికారులు వేట ప్రారంభిస్తారు. అది 36 గంటల వేట. దానికి రెండున్నర గంటల స్క్రీన్‌ప్లేనే ఈ ‘డిష్యూం’.
 
డా డా డింగ్ : నైకీ సాంగ్
నిడివి : 2 ని. 52 సె. హిట్స్ : 22,07,111

క్రీడా వ్యాయామ వస్తు సామగ్రికి సంబంధించిన ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమెరికన్ కంపెనీ ‘నైకీ’ విడుదల చేసి ‘డా డా డింగ్’ సాంగ్ యూత్‌ని ఇన్‌స్పైర్ చేస్తోంది! ఇట్ ఈజ్ టైమ్ టు లేస్ అప్ దోజ్ షూజ్. ఇట్ ఈజ్ టైమ్ టు గో టర్బో’ అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ అయిన ఈ వీడియో సాంగ్.. కేట్ పెర్రీ ‘రైజ్’ సాంగ్ లానే ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నీ నింపే విధంగా ఉంది. నైకీ ఎప్పుడూ నేరుగా తన ఉత్పత్తులకు ప్రచారం చేసుకోదు. రక్తాన్ని పరుగులెత్తించే ఒక సందేశాన్ని ఇచ్చి ఊరుకుంటుంది. ఈ వీడియోనే చూడండి! పాట మధ్యలో ఓ చరణం ఉంటుంది ‘లెట్ అజ్ గో హార్డ్ అండ్ షో ది వరల్డ్ దట్ ఎనీథింగ్ దె కెన్ డు.. వియ్ కెన్ డు బెటర్.. జస్ట్ డూ ఇట్ బెటర్’ అని. ఇంతకన్నా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మార్కెటింగ్ వ్యూహం ఉంటుందా?! ఊహల్లో మిమ్మల్ని ఒలింపిక్స్‌కి తీసుకెళ్లి అక్కడ తేలియాడించే వీడియో ఇది!
 
గర్ల్ స్లాప్ ఎ గై : ప్రాంక్
నిడివి : 2 ని. 19 సె. హిట్స్ : 11,45,820

నెట్‌లో కొంతమంది కుర్రాళ్లు నడుపుతున్న ‘ఫంక్ యు’ అనే ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ రెండు రోజుల క్రితమే ఈ ప్రాంక్‌ని అప్‌లోడ్ చేసింది. ‘ఫంక్ యు’ కుర్రాళ్లు బొమ్మ పాములతో ఓ కాలేజీలోకి చొరబడి  అందర్నీ భయపెడుతుంటారు. భయంతో పెద్దగా అరిచేవాళ్లు, పరుగులు తీసేవాళ్లు, కళ్లు తేలేసేవాళ్లు, ఎక్కడికక్కడ బిగుసుకుపోయేవాళ్లు, ఫస్ట్‌ఫ్లోర్ నుంచి కిందపడేవాళ్లు.. వీళ్లందర్నీ చూస్తే... పాపం నవ్వకూడదు కానీ... ఎంత వద్దన్నా నవ్వు వచ్చేస్తోంది. వీడియో కాబట్టి తీరిగ్గా చూస్తూ కడుపారా నవ్వుకోవచ్చు. స్పాట్‌లో ఉంటేనే... ఆ భయం ఎలాంటిదో తెలుస్తుంది. ఒక్కోసారి భయం.. కోపంగా కూడా మారుతుంది. అలా కోపంతో ఈ వీడియోలో ఒక అమ్మాయి తనను భయపెట్టిన అబ్బాయి చెంప ఛెళ్లుమనిపించింది. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో వర్ణించలేం కానీ.. స్వయంగా చూడండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement