ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Mon, Aug 7 2017 12:26 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

ఈ వారం యూట్యూబ్  హిట్స్‌

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

అబ్బాయి నాట్‌ సో.. స్ట్రాంగ్‌
శుభ్‌ మంగళ్‌ సావ్‌ధాన్‌ : ట్రైలర్‌
నిడివి : 2 ని. 52 సె., హిట్స్‌ : 61,15,868

‘‘ఎస్‌.. మిస్టర్‌ శర్మ.. మీ ప్రాబ్లం ఏంటి?’’ – డాక్టర్‌ గారి ప్రశ్న. ఆయన ఎదురుగా శర్మ, శర్మకు కాబోయే మామగారు కూర్చొని ఉన్నారు. శర్మ చెప్పడం మొదలు పెట్టాడు.  మామగారు మధ్య మధ్యలో ముఖం చిట్లించి శర్మపై విరుచుకు పడుతున్నారు. ‘‘రెండ్రోజుల్లో మా పెళ్లి డాక్టర్‌. ఈయన కూతుర్నే చేసుకోబోతున్నాను. ఒకరోజు ఏమైందంటే.. ఈయన, ఈయన భార్య ఇంట్లో లేనప్పుడు.. ఈయన కూతురు, నేను..  దగ్గర కాబోయాం. నేను తనను టచ్‌ చేశాను’’ అని శర్మ చెబుతుంటే, కాబోయే మామగారు ఇంతెత్తున లేచి, ‘‘సిగ్గుండాలి. పెళ్లి కాకుండా పిల్లను తాకడానికి’’ అని గయ్‌ మంటాడు. శర్మ కూడా పెద్దగా అరుస్తాడు.. ‘‘నేనే కాదు, మీ కూతురు కూడా నన్ను తాకింది’’ అంటాడు. ఇక్కడ ఈ సీన్‌ కట్‌ కాగానే అక్కడ ఫ్లాష్‌బ్యాక్‌లో.. శర్మ చెయ్యి వెయ్యడం, ఆ తర్వాత ఇంకేమీ చెయ్యలేకపోవడం, అమ్మాయి కంగారుగా.. ‘ఏమైందీ’ అని అడగడం, ‘అది జెంట్స్‌ ప్రాబ్లం’ అని శర్మ చెప్పడం ట్రైలర్‌లో రెండో సీన్‌. ఇదిగో ఆ ప్రాబ్లంతోనే అల్లుడు గారిని కాబోయే మామగారు డాక్టర్‌ దగ్గరికి తీసుకొస్తాడు. ‘ఎరకై్టల్‌ డిస్‌ఫంక్షన్‌’ (అంగస్తంభన సమస్య) అనే ఒక దుస్సాహస థీమ్‌తో తయారైన ‘శుభ్‌ మంగళ్‌ సావ్‌ధాన్‌’ అనే బాలీవుడ్‌ మూవీ ట్రైలర్‌ ఇది. సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల అవుతోంది. శర్మగా ఆయుష్మాన్‌ ఖురానా, శర్మకు కాబోయే భార్య సుగంధగా భూమి పెడ్నెకర్‌ ఇందులో యాక్ట్‌ చేస్తున్నారు. పైకి చెప్పుకోడానికి మగవాళ్లు బిడియపడే ఒక గంభీరమైన సమస్యకు కామెడీ ప్రజెంటేషన్‌ ఈ చిత్రం. ట్రైలర్‌లోని బిట్స్‌ చూస్తుంటే.. మూవీ హిట్టయ్యేలానే ఉంది!

నువ్వొక నికార్సైన దుష్టశక్తివి
మేజర్‌ లేజర్‌–సువా కారా: మ్యూజిక్‌ వీడియో
నిడివి : 2 ని. 46 సె., హిట్స్‌ : 5,06,76,064

గుర్రాలు డాన్స్‌ చెయ్యవు. ముందుకాళ్లు పైకెత్తి సకిలిస్తాయి. అయితే.. ఇరవై నాలుగేళ్ల బ్రెజీలియన్‌ ఫిమేల్‌ సింగర్‌ ‘అనిట్టా’, అదే దేశపు పాప్‌ గాయని పాబ్లో విట్టార్‌ల ఎడారి యుగళ నృత్యాన్ని ఈ వీడియోలో చూస్తున్నప్పుడు అచ్చంగా రెండు అందమైన గుర్రాలు డాన్స్‌ చేస్తున్నట్లే ఉంటుంది. ఇదొక పోర్చుగీసు దృశ్యగీతం. ‘మేజర్‌ లేజర్‌’ అనే ముగ్గురు అమెరికన్‌ కుర్రాళ్ల ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ బృందం దీనిని చిత్రీకరించి ‘సువా కారా’ అనే పేరుతో యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసింది. సావా కారా అంటే పోర్చుగీసు భాషలో ‘యువర్‌ ఫేస్‌’ అని అర్థం. ఫస్ట్‌ అనిట్టా స్టార్ట్‌ చేస్తుంది. ‘సిద్ధమవ్వు. బట్, యుద్ధం చెయ్యకు. చూడు, కానీ తలపడకు. నువ్వు మగాడిననుకుంటున్నావ్‌ కదా, బట్‌ నన్నాపలేవ్‌. నువ్వొక నికార్సైన దుష్టశక్తివి. కానీ నన్నెదుర్కోలేవు..’ అని! తర్వాత పాబ్లో విట్టార్‌ అందుకుంటుంది. ‘.. నేనిక్కడ ఉన్నాను, ఎటాక్‌ చెయ్యడానికి సిద్ధంగా. నీ ముఖం మీద గుద్దేస్తాను. సరిగ్గా ముఖం మీద..’ అని! ధైర్యవంతులైన అబ్బాయిలు మాత్రమే అందమైన అమ్మాయి ఇలా మాట్లాడితే తట్టుకోగలరు. మ్యూజిక్‌ హైలైట్‌. అంతకంటే హైట్‌ ఈ ఇద్దరు అమ్మాయిలు! బహుశా అందుకేనేమో ఈ వీడియో హిట్స్‌ కూడా త్వరత్వరగా కోట్లు దాటేస్తున్నాయి!

చందమామల బృందగానం
గర్ల్స్‌ జనరేషన్‌: హాలిడే మ్యూజిక్‌ వీడియో
నిడివి : 3 ని. 23 సె., హిట్స్‌ : 71,30,903

దక్షిణ కొరియా అమ్మాయిల ఫేమస్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘గర్ల్స్‌ జనరేషన్‌’ కొత్తగా విడుదల చేసిన 6వ ఫుల్‌ లెంగ్త్‌ ఆల్బమ్‌ ‘హాలీడే నైట్‌’లోని ఒక ట్రాక్‌ ఇది. పేరు ‘హాలీడే’. ఎనిమిది మంది (మొదట్లో తొమ్మిది మంది ఉండేవారు) బాలికల్లాంటి యువతులు ఫ్రెష్‌గా, ఎంతో ఎనర్జిటిక్‌గా సెలబ్రేట్‌ చేసుకున్న సమ్మర్‌ హాలీడే అనుభూతులు మిక్స్‌ అయి ఉన్న ఈ డాన్స్‌ వీడియో యూట్యూబ్‌లో వాయువేగంతో ఉల్లాసాన్ని వెదజల్లుతోంది. బ్యాండ్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అమ్మాయిలంతా ‘హో.. హో.. హో..’ అని డ్యాన్స్‌ చేసి, అర్థవంతంగా పాడి రెండు మూడు రోజుల్లోనే.. లాట్స్‌ ఆఫ్‌ ‘లవ్‌ అండ్‌ సపోర్ట్‌’ని హిట్‌ల రూపంలో కొట్టేశారు. ‘నాకెంతో బాగుంది. ఈ రోజు కోసం నేను ఎదురు చూశాను. మనం మొదటిసారి కలుసుకున్నప్పటì లానే మళ్లీ ఒకసారిప్పుడు కలుసుకున్నాం’ అంటూ ప్రారంభమయ్యే ఈ ఆహ్లాదగీతం.. ‘హే.. ఈరోజు మన హాలీడే. మన అలసట దినాల నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చాం. విద్యుల్లతలమై మెరిసి మురిసిపోదాం’ అని ఎండ్‌ అవుతుంది. మిస్‌ కాకుండా చూడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement