ప్రతీకాత్మక చిత్రం
లండన్ : కాలేజ్ లైఫ్ అంటే ఏ బాధ్యతలూ లేకుండా ఎంజాయ్ చేయడమే అనుకుంటారంతా..అయితే టెక్నాలజీ తెచ్చిన మార్పులతో ఇప్పుడు ప్రతి 5 విద్యార్థుల్లో ఒకరు డిప్రెషన్, యాంగ్జైటీలతో బాధపడుతున్నట్టు తాజా అథ్యయనం హెచ్చరించింది. టీనేజ్ వారిలోనే డిప్రెషన్ కేసులు విపరీతంగా పెరిగినట్టు గుర్తించారు. కాలేజీ విద్యార్థులు అధికంగా కుంగుబాటు, ఉద్వేగంతో బాధపడుతూ కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారని సెంటర్ ఫర్ కాలేజియేట్ మెంటల్ హెల్త్ నివేదిక వెల్లడించింది.
ప్రతి ఐదుగురు యూనివర్సిటీ విద్యార్ధుల్లో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని పరిశోధన తేల్చింది. సోషల్ మీడియాకు బానిసలుగా మారడం, అతిగా స్మార్ట్‌ఫోన్ల వాడకం కూడా విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పెంచుతోందని నిపుణులు హెచ్చరించారు. వాస్తవ జీవితంలో క్షణాలను ఆస్వాదించకుండా సెల్ఫీలు తీసుకుంటూ, మెసేజింగ్ యాప్స్‌లో మునిగితేలడం పలు అనర్థాలకు దారితీస్తోందని పేర్కొన్నారు. వర్చువల్ ప్రపంచంలోనే యువత కూరుకుపోతోందని ఫలితంగా కుంగుబాటు, మానసిక అలజడులు, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వేన్ స్టేట్ యూనివర్సిటీ సైకియాట్రీ ప్రొఫెసర్ డేవిడ్ రోసెన్‌బెర్గ్ విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment