ఐటీ సిటీలో... బీపీవో/కేపీవో కెరీర్! | bpo career in IT city | Sakshi
Sakshi News home page

ఐటీ సిటీలో... బీపీవో/కేపీవో కెరీర్!

Published Thu, Aug 28 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

ఐటీ సిటీలో... బీపీవో/కేపీవో కెరీర్!

ఐటీ సిటీలో... బీపీవో/కేపీవో కెరీర్!

బీపీవో అంటే.. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. కేపీవో అంటే.. నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్. బీపీవో/కేపీవో రంగం దేశ యువతకు అద్భుత అవకాశాలను అందిస్తోంది.  ఇప్పటికే వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఐటీ హబ్ హైదరాబాద్‌లో బీపీవో/కేపీవో రంగం విస్తృతమవుతోంది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 33 శాతం అధికంగా నియామకాలు జరిగినట్లు అంచనా. టీసీఎస్ బీపీవో, ఇన్ఫోసిస్ బీపీవో, విప్రో బీపీవో, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ తదితర ప్రధాన కంపెనీలు నియామకాలను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో సిటీలో బీపీవో/కేపీవోలో అవకాశాలపై ఫోకస్..
 
అంచనాలిలా :
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) అంచనా ప్రకారం- దేశవ్యాప్తంగా 500పైగా బీపీవో/కేపీవో కంపెనీలు, బిలియన్ల అమెరికన్ డాలర్ల రెవెన్యూతో లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో బీపీవో/కేపీవో జాబ్‌మార్కెట్ మరింత ఆశాజనకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రపంచ అవుట్‌సోర్సింగ్‌లో భారత్ నుంచే 52 శాతం మేర జరుగుతోంది. 2016 నాటికి ప్రపంచంలో బీపీవో సేవల ద్వారా వచ్చే ఆదాయం 176 బిలియన్ అమెరికన్ డాలర్లు దాటుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఆ మేరకు భారత్‌లోనూ ఈ రంగం ఏటా గణనీయంగా వృద్ధి నమోదు చేసుకునే అవకాశముంది. తద్వారా బీపీవో/కేపీవో రంగంలో దేశంలోని యువతకు ఉపాధి లభించనుంది.
 
ఆరు వేలకు పైగా :
ఐటీ హబ్‌గా పేరుపొందిన హైదరాబాద్‌లో బీపీవో/కేపీవో జాబ్ మార్కెట్ మరింత ఊపందుకోనుంది. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం నియామకాలు గణనీయంగా పెరిగాయంటున్నారు. ఇప్పటికే పలు బీపీవో కంపెనీలు రిక్రూట్‌మెంట్స్‌ను వేగవంతం చేశాయి.  ఈ ఏడాది హైదరాబాద్‌లోని బీపీవో సంస్థల్లో కనీసం ఆరు వేలకు పైగా కొలువులు ఖాయమని ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించడం, పలు దేశాలకు చెందిన క్లయింట్స్‌తో పనిచేయాల్సి రావడంతో కంపెనీలు ఉద్యోగులకు మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయని తెలిపారు బీ4బీ ఐటీ సొల్యూషన్స్ చైర్మన్ సురేశ్‌సింగ్.
 
బీపీవో/కేపీవో సేవలివే:
డేటా ఎంట్రీ మొదలుకొని మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్, కంటెంట్ రైటింగ్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, హెచ్‌ఆర్, ప్రాసెసింగ్, డిపార్ట్‌మెంట్ అవుట్‌సోర్సింగ్, టెక్నికల్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్,  ఫైనాన్షియల్ సర్వీసెస్ వరకూ.. అన్ని రకాల సేవలను విదేశాల్లోని తమ క్లయింట్లకు ఇక్కడి బీపీవో కంపెనీలు అందిస్తాయి. కేపీవో కంపెనీలు మాత్రం రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్, ఫైనాన్సియల్ కన్సల్టెన్సీ అండ్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, పేటెంట్ సంబంధిత సేవలు, ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ వెబ్ అప్లికేషన్స్, వెబ్ డెవలప్‌మెంట్, క్యాడ్/క్యామ్, బిజినెస్ రీసెర్చ్, అనలిటిక్స్, క్లినికల్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్ అండ్ బయోటెక్నాలజీ, బిజినెస్ అండ్ మార్కెట్ రీసెర్చ్ వంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారిస్తాయి.

ఇవిగో అవకాశాలు ఇక్కడ
బీపీవోలో డేటా ఎంట్రీ, మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షన్, కంటెంట్ రైటింగ్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, హెచ్‌ఆర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి విభాగాలు ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాల్లో బీపీఓ సేవలు అందుబాటులో ఉన్నాయి. పరిజ్ఞానం, సమాచార సంబంధమైన కార్యకలాపాల నిర్వహణను కేపీవో అంటారు. ఇందులో అధిక నైపుణ్యాలున్న వ్యక్తులకు అవకాశాలు లభిస్తాయి. కేపీవోలో లీగల్ సర్వీసెస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్ సంబంధ సేవలు, ఇంజనీరింగ్ సంబంధిత సేవలు, వెబ్ డెవలప్‌మెంట్, క్యాడ్/క్యామ్ అప్లికేషన్స్, బిజినెస్ రీసెర్చ్, అనలిటిక్స్, లీగల్ రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్, పబ్లిషింగ్, మార్కెట్ రీసెర్చ్ వంటి విభాగాలుంటాయి. నాలెడ్జ్ ప్రాసెస్ విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మేనేజ్‌మెంట్, లా, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, అకౌంటింగ్, బయోలాజికల్ సెన్సైస్ ఉత్తీర్ణులకు కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. యూకే, యూఎస్ పబ్లికేషన్ సంస్థలు డేటా ఎంట్రీ ఆపరేటర్స్, వెబ్ డిజైనర్స్, గ్రాఫిక్ డిజైనర్స్‌ను నియమించుకుంటున్నాయి. డిప్లొమా, మల్టీమీడియా సర్టిఫికెట్ కోర్సులు చేసిన వారిని కూడా తీసుకుంటున్నాయి. ఈ రంగంలో స్థాయిని బట్టి ప్రారంభ వేతనం రూ.8 వేల నుంచి రూ.25 వేల వరకూ ఉంటుంది.
 
కావాల్సిన అర్హతలు
బీపీవో రంగంలో అడుగుపెట్టాలంటే భారీ విద్యార్హతలు, అనుభవం ఏమీ అవసరం లేదు. ఇంటర్ లేదా బ్యాచిలర్‌‌స డిగ్రీ పూర్తయిన తర్వాత నేరుగా ఇందులోకి ప్రవేశించవచ్చు. బీపీఓలో షిఫ్ట్‌లవారీగా విధులు ఉంటాయి. పనివేళలు పగలు, రాత్రి ఉంటాయి. ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే తత్వం అవసరం. వేగంగా పనిచేసే నేర్పు ఉండాలి. ఇంగ్లిషు, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ వంటి అంశాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కస్టమర్ సర్వీసెస్ విభాగంలో పనిచేయొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గట్టి పట్టు ఉంటే టెక్నికల్ సపోర్ట్ ప్రొఫెషనల్స్‌గా స్థిరపడొచ్చు. కేపీవోలో చేరడానికి బీపీవోతో పోలిస్తే ఇంజనీరింగ్/మేనేజ్‌మెంట్/లా వంటి అర్హతలు అవసరం.
 
బలాలు... బలహీనతలు

బీపీవో/కేపీవోలో పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నప్పటికీ జీవనశైలికి భిన్నంగా రాత్రివేళలో విధులు ఉంటాయి. నిద్రలేమి కారణంగా తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుం టే ఈ రంగంలో పనిచేయడం సులువే.
 
నాస్కామ్ గణాంకాల ప్రకారం... టాప్-10 బీపీఓ కంపెనీలు జెన్‌పాక్ట్ , డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్, ఐబీఎం దక్ష్, ఆదిత్య బిర్లా మినాక్స్ వరల్డ్‌వైడ్, టీసీఎస్ బీపీఓ, విప్రో బీపీవో, ఫస్ట్‌సోర్స్, ఇన్ఫోసిస్ బీపీఓ, హెచ్‌సీఎల్ బీపీఓ, ఎక్సెల్ సర్వీస్ హోల్డింగ్.
 
బీపీవో/కేపీవోపై యువత ఆసక్తి
‘‘బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్) సెక్టార్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగుల నియామకం జరుగుతోంది. పనివేళల్లో కొంత వెసులుబాటు కల్పించ డం ద్వారా ఉద్యోగుల పనితీరును పెంచుతున్నాం. రాత్రి వేళల్లో విధులు కావడంతో ఈ రంగంపై గతంలో కొన్ని అపోహలు ఉండేవి. వాటిని పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ‘నాస్కామ్’తోపాటు పలు బీపీవో కంపెనీలు చేపడుతున్న చర్యలతో యువత బీపీవో/కేపీవోను కెరీర్‌గా ఎంచుకు నేందుకు ఆసక్తి చూపుతోంది. విద్యార్థులు చదువుకుంటూనే తీరిక వేళల్లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ సంపాదించుకొనే అవకాశం ఉంది’’
- సురేశ్‌సింగ్, చైర్మన్, బీ4బీ ఐటీ సొల్యూషన్‌‌స
 
ఆర్థిక వ్యవస్థలో కీలకం

‘‘మన దేశంలో ఢిల్లీ, బెంగళూరు, పుణె తదితర నగరాలతో పాటు హైదరాబాద్ కూడా ఐటీ సెక్టార్‌లో దూసుకుపోతోంది. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్(బీపీఎం) రంగంలో యువతకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ప్రారంభంలోనే మంచి వేతనం అందుకునే అవ కాశం ఉంది. ఇండియన్ బీపీవో సెక్టార్‌లో ఉద్యో గస్తుల సగటు వయసు 21-30 ఏళ్ల లోపే. బీపీఎం యువతకు మంచి కెరీర్ ఆప్షన్.  కరిక్యులంలో బీపీఎం కోర్సును అకడమిక్ స్థాయిలో చేర్చాలని ప్రభుత్వానికి నాస్కామ్ ప్రతిపాదించింది.
 
గ్లోబల్ బిజినెస్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బీపీఎం రంగం కీలకమైనదని అన్ని దేశాలూ గుర్తించాయి. సోషల్ మీడియా, మొబైల్ అప్లికేషన్‌‌స, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటివి ప్రపంచాన్నే శాసించగల టెక్నాలజీలుగా మారాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటే కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదగొచ్చు. బీపీవో/ కేపీవోలో రాణించాలంటే ఆంగ్ల ఉచ్ఛారణ, కమ్యూనికేషన్ స్కిల్స్, భావోద్వేగాలపై నియంత్రణ, టీమ్ స్పిరిట్  ఉంటే చాలు’’
 -పార్థ డే సర్కార్, సీఈవో, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement