నట్టింట్లో డ్రాగన్ | China Dragon Interior designing trendz entery in Hyderabad city | Sakshi
Sakshi News home page

నట్టింట్లో డ్రాగన్

Published Fri, Jul 18 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

నట్టింట్లో డ్రాగన్

నట్టింట్లో డ్రాగన్

హైదరాబాదీల నట్టింట్లో చైనా కొలువవుతోంది. ఇల్లు కట్టడానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తున్న నగరవాసులు ఇంటీరియర్‌కీ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే తక్కువ ధర... ఎక్కువ మన్నిక... డిఫరెంట్ డిజైన్స్ ఇన్ మోర్ కలర్స్‌తో ఆకట్టుకుంటున్న చైనా ఇంటీరియర్‌పై మోజు పెంచుకుంటున్నారు. లేట్ అయినా సరే లేటెస్ట్‌గా ఉండాలని చైనా నుంచి ఇంటీరియర్ డిజైన్స్‌తోపాటు ఫర్నిచర్‌ను దిగుమతి చేసుసుకుంటున్నారు.
 
 ప్రపంచంలోని అన్ని రకాల ఉత్పత్తుల్లో అగ్రదేశాల మార్కెట్‌లను శాసిస్తున్న చైనా ఇంటీరియర్ డిజైన్స్‌ను విరివిగా ఉత్పత్తి చేస్తోంది. అధునాతన మోడల్స్, తక్కువ ధర, ఎక్కువ మన్నికతో చేసిన పలు రకాల వస్తువులు అక్కడ దొరుకుతుండటంతో నగరంలోని ఇంటీరియర్ డిజైనర్స్ చైనా బాట పడుతున్నారు. అలాగే ైచె నా ఇంటీరియర్ కోసం సిటీలో కొన్ని ఏజెన్సీలు కూడా వెలిశాయి.
 
 ‘చైనా’ ఇల్లు

 సికింద్రాబాద్ బండిమెట్‌లో నివసించే నాగేందర్ అనే వ్యాపారి మొత్తం చైనా నుంచి తెప్పించిన మెటీరియల్‌తోనే ఇంటి నిర్మాణం చేయించుకున్నారు. అక్కడి నుంచి తెప్పించడం వల్ల ఖర్చు కూడా సగం తగ్గిందని చెబుతున్నారు.
 
 గ్లాస్ యాంటీ స్కిడ్ ఫోర్సెలిన్ టైల్స్

 ఈ టైల్‌పై 3 ఎంఎం గ్లాస్ ఉంటుంది. ఇది షైనింగ్ ఇవ్వడమే కాదు జారిపడకుండా, గీతలు పడకుండా ఉంటుంది. ఈ టైల్స్ ఇండియాలో రూ.500లకు చదరపు అడుగుకు దొరుకుతుండగా చైనాలో రూ.200లకే లభిస్తోంది.
 
 కే9 క్రిస్టల్ శాండ్లియర్
 కే9 క్రిస్టల్‌తో తయారైన ఈ శాండిలైజర్‌లో ఎక్కువ క్లారిటీ ఉంటుంది. ఆస్టియన్ మెటీరియల్‌తో తయారైన ఈ శాండిలైజర్ ధర చైనాలో 40 వేలు ఉండగా... ఇక్కడ సుమారు రూ.2.5లక్షలు పలుకుతోంది.
 
 త్రీడీ వాల్ పేపర్స్
 గోడలకు అతికించే త్రీడీ వాల్ పేపర్స్ భిన్నమైన రంగులతో ప్రత్యేక శోభను ఇస్తున్నాయి. బయటకు చొచ్చుకుని వచ్చినట్లున్న ఇవి పక్కనే ఉన్న అనుభూతిని కల్గిస్తున్నాయి.
 
 షవర్ క్యూబికల్
 ఇది బలంగా కొట్టినా పగిలిపోని గ్లాస్‌తో తయారైంది. దీన్నే టఫ్‌డ్ గ్లాస్ అంటారు. చైనాలో దీని ధర రూ.11వేలు మాత్రమే ఉండగా ఇక్కడ రూ. 28వేలు పలుకుతోంది.  
 
 ఆటోమేటెడ్ బెడ్
 ఈ ఆటోమేటెడ్ బెడ్‌కి చాలా ప్రత్యేకతలున్నాయి. బెడ్‌కే కాళ్లవైపు ఎల్‌సీడీ ఉంటుంది. రిమోట్ నొక్కగానే అది పైకి వస్తుంది. చేతికి ఎడమవైపున చిన్న తెర, మరో వైపు చిన్న ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఊఫర్స్, బేస్ స్పీకర్స్, డీవీడీ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. వెనుక వీపుకు 4 రకాలుగా మసాజ్ చేసే సౌకర్యం ఉంది. చైనాలో ఈ బెడ్ ధర 1.25 లక్షలు మాత్రమే. ఇండియాలో సుమారు రూ.4లక్షలు ఖరీదు చేస్తోంది.  
 
 ఓక్ వుడ్ రెడీమేడ్ డోర్స్

 ఓక్ వుడ్‌తో తయారైన ఈ రెడీమేడ్ డోర్స్‌కు 16 లాక్‌లు ఉంటాయి. లైట్ వెయిట్‌తో ఉన్న ఈ ఉడ్‌కి చెద పట్టదు. 50ఎంఎం మందముండే డోర్స్‌కు వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు 350 డిగ్రీల హీట్‌ను తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. ఇది చైనాలో కేవలం 25వేలకు దొరుకుతుంది.
 
 ఆదరణ పెరుగుతోంది
 నగరంలో నాలుగు హోటల్స్‌లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో ఇంటీరియర్ డిజైన్ చేశాం. కొన్ని ఇళ్లు నిర్మించాం. చైనాలో ఒక్కో మెటీరియల్‌కు ఒక్కో నగరమే ఉంది. సెరామిక్ సిటీ, లైటింగ్ సిటీ, ఫర్నిచర్ సిటీ, లెదర్ సిటీ ఇలా వందల షోరూమ్‌ల్లో విభిన్న డిజైన్లున్నాయి. అవి కూడా మన  సగం ధరకే. దిగుమతి చేసుకునేందుకు సుమారు 45 రోజులు పడుతుంది.
 - కిరణ్, న్యూజెన్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ అధినేత
 
 ఇంటీరియర్‌కు తగ్గట్టుగా ఫర్నిచర్
 ఇంటీరియర్‌తో పాటు దానికి తగినట్లుగా ఇంట్లో వాడే వస్తువులను కూడా అక్కడి నుంచే తెప్పిస్తున్నారు. ఎలివేషన్ టైల్స్, టాయిలెట్ మోటిఫ్ టైల్స్, లేజర్ కట్ టైల్స్, వెర్టిఫైడ్ ప్లోరింగ్, 3డీ వాల్ పేపర్స్, మార్బుల్ మోల్డింగ్స్, సీపీ ఫిట్టింగ్, శాండిలైజర్స్, ప్యానెల్ ఎల్‌ఈడీ లైట్స్, రెడీమేడ్ డోర్స్, షవర్ క్యూబికల్, డైనింగ్ టేబుల్స్, బెడ్స్, సోఫాసెట్స్ తదితర ఇంటీరియర్ వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
 - డి.వెంకటేశ్వరరావు/ రాంగోపాల్‌పేట్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement