
విడుదలకు ముందే 'గోపాల గోపాల' రికార్డు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం విడుదలకు ముందే రికార్డు నెలకొల్పింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా నైజాం రైట్స్ కోసం 14 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్ధ ముందుకొచ్చినట్లు తెలిసింది. మిగతా చోట్ల కూడా ఇదే రేంజ్‌లో మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. రిలీజ్ అయిన తరువాత హిట్ టాక్ తెచ్చుకుంటే, ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసేఅవకాశం ఉందని సినీవర్గాల అంచనా.
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీస్ మేకింగ్ ఊపందుకుంది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు. బాలీవుడ్‌లో ఏదైనా మూవీ హిట్ అయితే చాలు దాని రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు క్యూలు కట్టేస్తున్నారు. బీ టౌన్‌లో హిట్ కొట్టిన ఓ మై గాడ్ హిందీ చిత్రాన్ని, ప్రస్తుతం పవన్, వెంకీ కాంబినేషన్‌లో తెలుగులో 'గోపాల గోపాల' పేరుతో రీమేక్ చేస్తున్నారు.హిందీలో పరేశ్ రావెల్, అక్షయ్ కుమార్ పోషించిన పాత్రల్ని వెంకటేష్, పవన్ కళ్యాణ్లు పోషిస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రోజుకో హాట్ న్యూస్‌తో అంతకంటే వేగంగా ఈ సినిమా మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తుండటంతో ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల అభిమానుల్లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది.
**