సౌశీల్యవంతుడు
జ్యోతిర్మయం
పుట్టుకచేత, విద్యా సంపదల చేత గొప్పతనం ఉన్నప్ప టికీ తక్కువ వారితో అరమరిక లేకుండా కలసి ఉండ టాన్ని సౌశీల్యం అని అంటారు. ఇట్టి సౌశీల్యవంతు లలో అగ్రగణ్యుడు శ్రీరామచంద్రుడు. ఇతడు క్షత్రియ వంశంలో జన్మించినా వేదవేదాంగాల్లో, ధనుర్వేదాది ఉపవిద్యల్లో నిష్ణాతుడైనా, చక్రవర్తి కుమారుడైనా, అష్టై శ్వర్యములు కలవాడైనా తనకు ఏ మాత్రం సరిజోడుగా నిలువలేని ముగ్గురితో ఎటువంటి అరమరిక లేకుండా కలసియుండేవాడు.
ముగ్గురిలో మొదటివాడు పడవ నడుపుకొనే పల్లె వాడైన గుహుడు. గుహుణ్ణి శ్రీరామచంద్రుడు ఆత్మస ముడైన సఖుడని భావించాడు. అడవిలో నివసించే గుహుడు తనకు ఎదురుగా వచ్చి స్వాగ తం పలికినం దుకు శ్రీరామచంద్రుడు ఎంత గానో పొంగిపోయాడు.
రెండవవాడు సుగ్రీవుడు. ఇత డు మానవజాతికి చెందినవాడే కాడు. ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకు దూకే, గంతులు వేసే వానరజాతికి చెందినవాడు. అట్టి సుగ్రీవుణ్ణి శ్రీరామ చంద్రుడు తనకు సంరక్షకుడుగా, సుఖదుఃఖానుభ వాలలో తోడుగా నిలిచే ఆప్తునిగా భావించెను.
మూడవవాడు మానవ స్వభావానికి విరుద్ధమైన రాక్షసజాతికి చెందిన వాడు. శ్రీరామచంద్రుని భార్య యైన సీతాదేవిని అపహరించిన రావణాసురునికి స్వయంగా తమ్ముడైన విభీషణుడు. సుగ్రీవాదులు విభీ షణుణ్ణి నమ్మవద్దని సూచించినప్పుడు, ఈ విభీషణుడే గాక స్వయంగా రావణాసురుడు మిత్రభావంతో వచ్చి నా అతణ్ణి కూడా క్షమించి రక్షిస్తాను అని తెలిపిన మహనీయుడు శ్రీరామచంద్రుడు.
అందరితో కలసిమెలసి ఉండటమే కాకుండా తనకు సంబంధించిన వారికి గాని, తన రాజ్యంలోని ప్రజలకు గాని ఎవరికి ఏ కష్టం వచ్చినా కష్టాలలో ఉన్న వారి కంటే శ్రీరామచంద్రుడే ఎక్కువగా బాధను పొం దేవాడు. వారి కష్టాలు తొలగునట్లుగా సహాయం చేసే వాడు అని వాల్మీకి రామాయణంలో ప్రస్తావించారు..
తనకు ఆప్తులైన సుగ్రీవునికి, విభీషణునికి రాజ్య పట్టాభిషేకం చేసిన పిమ్మటనే తనకు రాజ్య పట్టాభి షేకం జరుగుటకు రాముడు అంగీకరించాడు.
తన రాజ్యంలోని ప్రజలకు సంబంధించి ఎవరిం ట్లో ఏ శుభకార్యం జరిగినా, శుభకార్యం జరుపుకునే వారికంటే తానే ఎక్కువగా ఆనందిస్తూ వారికి విరి విగా కానుకలను బహుమానంగా ఇచ్చేవాడు అని శ్రీరామచంద్రుని ఔదార్యాన్ని వాల్మీకి మహర్షి శ్రీమ ద్రామాయణంలో వర్ణించాడు.
మహర్షులు కోరకముందే వారి యజ్ఞయాగాది వైదిక కార్యక్రమాలకు రక్షణ ఏర్పాటు చేయవలసి ఉం ది కానీ అట్లుగాక వారు వచ్చి కోరిన మీదట వారి రక్ష ణకు తాను సిద్ధపడితిని కదా అని శ్రీరామచంద్రుడు ఎంతగానో సిగ్గుపడ్డాడు.
అవతార పురుషుడైనా, అద్భుత శక్తియుక్తులు, ప్రజ్ఞాపాటవాలు మెండుగా నిండుగా కలిగియున్నా, ‘ఆత్మానం మానుషం వన్యే’ అని పేర్కొని తనను ఒక సామాన్య మానవునిగానే భావించుకున్న సౌశీల్యవం తుడు, సచ్చరితుడు శ్రీరామ చంద్రుడు. అట్టి మహనీ యుని ఆదర్శంగా గ్రహిద్దాం.
సముద్రాల శఠగోపాచార్యులు