లవర్ టెస్ట్.. లవ్ ట్విస్ట్ | Lover Test .. Love Twist shortfilm | Sakshi
Sakshi News home page

లవర్ టెస్ట్.. లవ్ ట్విస్ట్

Published Sun, Apr 12 2015 10:20 PM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

లవర్ టెస్ట్.. లవ్ ట్విస్ట్

లవర్ టెస్ట్.. లవ్ ట్విస్ట్

తత్వవేత్త సోక్రటీస్ గురించి తెలిసిన వాళ్లకి ఆయన భార్య ఒక గయ్యాళి అని తెలిసే ఉంటుంది. గయ్యాళి, గడుసు, మొండి భార్యలను భర్త ఎలాగూ భరించకతప్పదు. కానీ తొలిప్రేమ చిగురిస్తున్నప్పుడే ప్రేయసి నానా పరీక్షలు పెడుతుంటే, ఆ ప్రియుడు పడే తంటాల గురించి చెప్పేదేముంది. పెళ్లి కాకముందే సన్యాసం తీసుకుంటాడు. రియల్ లైఫ్ లవ్‌ను రీల్ లైఫ్‌తో కంపేర్ చేసే ప్రేయసి.. ఆమెకు తాను హీరోను కాదు మామూలు లవర్ అని చెప్పలేక ఆ ప్రేమికుడు పడే అష్టకష్టాలే ‘ప్రేమ రాక్షసి’.

ఫోన్ చేసి కళ్ల ముందుకు రమ్మంటూ ఆర్డర్లు.. ఇంటి దగ్గరికి వచ్చి సైట్ కొడితేనే రియల్ లవర్ అని ఒప్పుకుంటానని బెట్టు చేయడాలు.. ప్రేయసి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక.. కొంటె చూపులతో సైట్ కొడుతుంటాడు సదరు ప్రేమికుడు. కట్ చేస్తే పోలీసులు వచ్చి మనోడి బ్యాండ్ బజాయిస్తారు. పవన్‌కల్యాణ్‌లా ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని రావాలని.. హీరోయిన్‌కు జ్వరం వస్తే అదేదో సినిమాలో సిద్ధార్థ ఫాస్టింగ్ ఉన్నట్టు తనకు జ్వరం వస్తే ఉపవాసం ఉండాలని.. షరతులు. అవీ పాసయ్యాక.. లవ్ లెటర్స్ ఇచ్చిపుచ్చుకోవాలని కొత్త చిక్కు తెచ్చిపెడుతుంది. తీరా లవ్ లెటర్ ఇచ్చాక.. ‘రక్తంతో
 రాయలేదంటే.. నీది నిజమైన ప్రేమ కాద’ని నిష్టూరాలాడుతుంది.

ఇలాంటి ప్రేయసి దొరికితే ఆ ప్రియుడి సంగతి ఎలా ఉంటుందో ఈ చిట్టి చిత్రంలో చూడొచ్చు. లవర్స్ పోటీపడి ప్రేమించమని సతాయించే ప్రేయసిని భరించలేక సోలో లైఫే సో బెటర్ అనుకుంటాడు ఆ అబ్బాయి. కుమార్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ పది నిమిషాల చిత్రం క్లైమాక్స్ మిస్ కాకండి. విజువల్ క్వాలిటీలో తేడా ఉన్నా.. కామెడీ నిండుగా పండటంతో హాయిగా నవ్వుకోవచ్చు.
 www.youtube.com/ watch?v=g6QrtgZnINA
- ఓ మధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement