
మాక్ టెయిల్స్
ఎండాకాలం వచ్చేసింది. సాలిడ్ స్పైసెస్‌కి గుడ్‌బై చెప్పి.. ఠండా డ్రింక్స్‌కు వెల్‌కమ్ చెప్పాల్సిన టైమ్. ఇక డాక్టర్స్ రిఫరెన్స్ కూడా ఎక్కువ నీళ్లతో పాటు, కోకోనట్ వాటర్‌కే. మరి రోజంతా వర్క్ చేసి కేవలం కొబ్బరి నీళ్లకే పరిమితం అయితే ఎలా..! అందుకే ఎనర్జీ డ్రింక్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి రెస్టారెట్స్, జ్యూస్‌స్టాల్స్. ఆరోగ్యంగా ఉంచే సమ్మర్ మాక్‌టైల్స్‌ను అందిస్తున్నాయి. రెస్టారెంట్‌కు వెళ్లలేనివాళ్లు ఇంట్లో కూడా తయారు చేసుకోగలిగే సింపుల్ డ్రింక్స్‌ని మనకు పరిచయం చేస్తున్నారు అమీర్‌పేట్ ఆదిత్య పార్క్’ ఫుడ్ అండ్ బెవరేజెస్ మేనేజర్ అమితేష్ కుమార్. అవేమిటో ఓ లుక్కేయండి!
- సిరి
డ్రూలింగ్ గోవా
సీజనల్ ఫ్రూట్ అయిన జామపండుకు, ఎనర్జీని పెంచే నిమ్మరసాన్ని జోడించి, అల్లం, కొత్తిమీర, చాట్‌మసాలా, బ్లాక్‌సాల్ట్ బ్లెండ్ చేసిన ఈ డ్రింక్‌కు కాస్త ఐస్ యాడ్ చేసుకుని లాగించేయొచ్చు. ఇంటినుంచి బయటికి వెళ్లేముందో, బయటినుంచి ఇంటికొచ్చాకో ఒక్క గ్లాస్ తాగితే అలసట, నీరసం ఇట్టే మాయమవుతాయి.
సిల్లీ సర్‌ప్రైజ్
ఈకాలంలో ఫ్రెష్‌గా దొరికే స్ట్రాబెరీకి నిమ్మరసం, నారింజగుజ్జును కలిపి బెండ్ చేసి... కొన్ని ఐస్‌ముక్కలు కలుపుకుని టేస్ట్ చేయండి. ఎంత నీరసంగా ఉన్నా సరే రెండు నిమిషాల్లో రిఫ్రెష్ అయిపోతారు. అంతేకాదు... ఇంటికి వచ్చే గెస్ట్‌లకు చల్లచల్లగా ఈ సిల్లీ సర్‌ప్రైజ్‌ని అందిస్తే... నిజ ంగానే సర్‌ప్రైజ్ అయిపోతారు.
స్క్వేర్ కట్
ఆల్‌టైమ్ ఫేవరేట్ ఆపిల్ పండ్లకు పుచ్చపండు ముక్కలు, షుగర్ సిరప్, నిమ్మరసం, పుదీనా ఆకులు, కాస్త సోడాని మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. టేస్టీగా ఉండే ఈ డ్రింక్ హెల్దీ కూడా. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇస్తే... ఇష్టంగా లాగించేస్తారు. సో లెట్స్ ట్రై!