అద్వితీయం
‘గ్రీన్ గ్రోత్’... ఈ థీమ్‌తో కేరళ త్రిసూర్‌లో జరిగిన విబ్జియార్ అంతర్జాతీయ డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆబాలగోపాలాన్నీ అలరించింది. ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించిన ఈ పండగలో ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలింస్‌కు గాడ్‌ఫాదర్ ఆనంద్ పట్‌వర్దన్‌తో పాటు అనేకమంది దేశవిదేశ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన అస్మితా ఫౌండేషన్ ప్రదర్శించిన ‘అహల్య’ నృత్యరూపకం ఫెస్టివల్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అహల్య అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ రూపకం నలభై నిమిషాల పాటు ఆహూతులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
అహల్య చుట్టూ ఉన్న నాటి పరిస్థితులను నేటితరం స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో పోల్చుతూ వినిపించిన వాయిస్ ఓవర్ ఆలోచనాత్మకంగా ఉంది. వసంత కన్నభిరన్ రాసిన ఈ బ్యాలేకు రాజేశ్వరీ సాయినాథ్, ఆమె కుమార్తె వైష్ణవి బృందం చేసిన నాట్యానికి ముగ్ధులైన ఆహూతులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. లాభాపేక్ష లేకుండా, సామాజిక బాధ్యతగా చేపట్టిన ఇలాంటి ఫెస్టివల్స్ ప్రతి రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉందని, ఇది ఓ మంచి పరిణామమని నగరం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన షార్ట్ ఫిలిం మేకర్ నవీన్‌రెడ్డి చింతల, రెయిన్‌బో ఆర్జే మహ్మద్ అబ్దుల్ నయీం అభిప్రాయపడ్డారు.
- ఓ మధు