
రాగరంజని
ద్రవిడ సీమలో విరిసిన గాత్రం సిటీవాసులను రాగ రంజనిలో ఓలలాడించనుంది. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ రంజనీ శివకుమార్ గళవిన్యాసానికి బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 8లోని సప్తపర్ణి వేదిక కానుంది.
రంజని కర్ణాటక గాత్ర కచేరి ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రవేశం ఉచితం. ఫోన్: 040- 23705440