ఆధునిక హంగులు
తెలుగు భాషకు మకుటం పద్యనాటకం. మన సంస్కృతి, సాహిత్యం, సంగీతం మిళితమైన పద్యనాటకం కనువురుగమతోంది. దీనికి వుళ్లీ జీవం పోసేందుకు... నాడు విశేష ఆదరణ పొందిన ‘సత్య హరిశ్చంద్ర’ పద్యనాటకాన్ని చలనచిత్రంగా రూపొందించారు మోరల్ ప్రొడక్షన్స్‌వారు. బంజారాహిల్స్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఆదివారం ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి... గ్రాఫిక్స్ హంగులద్దుకున్న సత్యహరిశ్చంద్ర కళాభిమానుల మనసు దోచుకుంది. సినీ ప్రముఖులు కోడి రావుకృష్ణ, ఆర్. నారాయుణవుూర్తితో పాటు నందవుూరి లక్ష్మీపార్వతి తదితరులు సినిమాను వీక్షించారు.
రహస్యం
సౌతిండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆదివారం రవీంద్రభారతిలో ప్రదర్శించిన ‘ఇరందం రహస్యం’ తమిళ నాటకం నవ్వులు చిందించింది. రైల్వే స్టేషన్‌లో రైలు కోసం వేచివున్న ముగ్గురి మధ్యలో ఓ వుహిళ వచ్చి కూర్చుంటుంది. వారిలో ఇద్దరికి మినహా ఆమె కనిపించదు. వారందరి చరిత్రలూ ఆమెకు తెలుసు గానీ... ఆమె గురించి ఎవరికీ తెలియదు. ఆమె ఎవరన్నది తెలుసుకొనే ప్రయత్నమే నాటక ఇతివృత్తం. వైజీ మహేంద్రన్ గ్రూప్ ప్రదర్శించిన ఈ నాటకం కడుపుబ్బ నవ్వించింది. సినీ నటి ఐశ్వర్య ప్రత్యేక ఆకర్షణ.