దుబాయ్‌లో శిల్పారెడ్డి ‘షో’ | Shilpa Reddy At Dubai India Fashion Week | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో శిల్పారెడ్డి ‘షో’

Published Wed, Sep 10 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

దుబాయ్‌లో శిల్పారెడ్డి ‘షో’

దుబాయ్‌లో శిల్పారెడ్డి ‘షో’

నగరానికి చెందిన టాప్ మోడల్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి.. దుబాయ్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో తనదైన డిజైన్లతో ఆకట్టుకున్నారు. దుబాయ్‌లోని జమైరాహ్ ఎమిరేట్స్ టవర్స్ వేదికగా మినిస్ట్రీ ఆఫ్ ఈవెంట్స్, డ్రీమ్ అడ్వర్టయిజింగ్, జడ్ హౌజ్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఇండియా ఫ్యాషన్ వీక్‌లో కళ్లు చెదిరే కలెక్షన్‌నుపదర్శించి అభినందనలు అందుకున్నారు. షాహిద్ కపూర్, బిపాసాబసు, సోహాఅలీఖాన్, విక్రమ్ ఫడ్నిస్, జయామిశ్రా, అర్చనా కొచ్చర్ తదితర ముంబై సినీ, ఫ్యాషన్ రంగ ప్రముఖులు తళుక్కుమన్న ఈ షోలో నగరం నుంచి కేవలం శిల్పారెడ్డి మాత్రమే పాల్గొన్నారు.
 
 కాటన్, చందేరీ, సిల్క్ ఫ్యాబ్రిక్స్‌ను తీసుకుని ‘గోల్డ్ ఫ్రాగ్నెన్స్ ఆఫ్ ది రాఫిమైన్’ పేరుతో ఆమె అందించిన కలెక్షన్.. అతిథులకు భారతీయ ఫ్యాషన్‌లో వైవిధ్యాన్ని రుచి చూపింది. గోల్డ్-రెడ్ సౌతిండియన్ ధోవతి, టెంపుల్ జువెలరీ ధరించి ర్యాంప్ వాక్ చేసిన శిల్పారెడ్డి వావ్ అనిపించారు. ‘దుబాయ్ షోలో భారతీయ ఫ్యాషన్స్‌ను ప్రదర్శించడం ఓ చక్కని అనుభవం. నా కలెక్షన్‌కు అక్కడి ఫ్యాషన్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింద’ని శిల్పారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.   
 -ఎస్బీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement