కూచిపూడి ఆహారం
ఆవకాయ.. ముద్దపప్పు.. పప్పుచారు.. గడ్డపెరుగు.. కలగలసిన రుచికర భోజనం ఇప్పుడు మన ఇంట్లోనే కాదు హోటల్‌లో కూడా దొరుకుతుంది. అచ్చతెలుగు రుచులు అందించేందుకు మాదాపూర్‌లో కూచిపూడి హోటల్ బుధవారం ప్రారంభమైంది. శాకాహార విందే కాదు.. పెద్దమ్మ మాంసం పలావ్, మాంసం పప్పుచారు, రాజాగారి భోజనం, రాజాగారి కోడి పలావ్, బొమ్మిడాయిల పులుసు, భీమవరం కోడి వేపుడు వంటి మాంసాహార వంటకాలు ఇక్కడ కొలువుదీరాయి. ఈ హోటల్ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ స్టార్ సునీల్ విచ్చేశారు. ‘వెస్ట్రన్ రుచులు పరచుకున్న మెనూలో గంటల తరబడి వెతికినా మన వంటకం కనిపించదు. అలాంటిది మనైవైన రుచులను మరింత పసందుగా అందించడం సూపర్బ్‌గా ఉంది’ అని సునీల్ అన్నారు.