ఆలూ మసాలా రోస్ట్ | aloo Masala Roast | Sakshi
Sakshi News home page

ఆలూ మసాలా రోస్ట్

Published Sun, May 31 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

ఆలూ మసాలా రోస్ట్

ఆలూ మసాలా రోస్ట్

ఫుల్ మీల్స్
కావలసినవి:
బంగాళాదుంపలు - పావు కిలో, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, కారం - 2 చెంచాలు, మసాలా పొడి - 2 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, కరి వేపాకు - మినప్పప్పు - శెనగపప్పు - జీలకర్ర - ఆవాలు - ఒక్కో చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా
తయారీ: బంగాళాదుంపల్ని ఉడికించి, తొక్క తీసేసి, పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకుని..

అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు కలిపి కాసేపు నాననివ్వాలి. బాణలిలో నూనె వేడిచేసి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయాలి. వేగాక ఉల్లి పాయ, పచ్చిమిర్చి ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేయాలి.  ముక్కలు బాగా మగ్గాక గరం మసాలా వేసి దించేసుకోవాలి.
 
స్పైసీ క్యారెట్  పులావ్
కావలసినవి: బియ్యం - 2 కప్పులు, క్యారెట్లు - 4, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయలు - 2, పెరుగు - పావుకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు, ఆవాలు - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా, గరం మసాలా - 1 చెంచా, లవంగాలు - 5, దాల్చినచెక్క - చిన్నది, అనాసపువ్వు - 1, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - 1 కట్ట, వేయించిన జీడిపప్పులు - 10, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నెయ్యి - 4 చెంచాలు
 
తయారీ: క్యారెట్స్‌ని చిన్నగా కోసుకుని, పెరుగు, గరం మసాలా, ఉప్పు, పసుపు కలిపి అరగంట ఉంచాలి. బియ్యం కడిగి, కాస్త పలుకు ఉండేలా అన్నం వండాలి. వండేప్పుడు లవం గాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు గుడ్డలో మూటగట్టి వేయాలి. మసాలా ఘాటు అన్నానికి పట్టేస్తుంది కాబట్టి వండిన తర్వాత మూట తీసేయాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీల కర్ర, కరివేపాకు వేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక క్యారెట్ మిశ్రమం వేయాలి. రెండు నిమి షాల తర్వాత లోతైన గిన్నెలో అన్నం, క్యారెట్ మిశ్రమం పొర లుగా వేసుకుని, మూత పెట్టి, కాసేపు ఉడికించాలి. జీడిపప్పు, కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.
 
కొబ్బరి-కోవా లడ్డు
కావలసినవి: పచ్చికొబ్బరి తురుము - రెండున్నర కప్పులు, పచ్చి కోవా - 1 కప్పు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - 1 చెంచా, నెయ్యి - పావుకప్పు, జీడిపప్పు- బాదంపప్పు-కిస్‌మిస్ - కావలసినన్ని
 
తయారీ: అరకప్పు కొబ్బరి తురుమును ముందే పక్కన పెట్టేసుకోవాలి. స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. కాగాక సన్నగా తరిగిన జీడిపప్పు, కిస్‌మిస్, బాదంపప్పులను వేసి వేయించి తీసేయాలి. అదే గిన్నెలో కొబ్బరి తురుము వేయాలి. కాస్త రంగు మారాక పచ్చికోవా వేసి మరికాసేపు వేయించాలి. తర్వాత చక్కెర వేయాలి. చక్కెర కరిగి మిశ్రమం అంతా ముద్దలా అయ్యాక వేయించిన డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. చేతికి నెయ్యి రాసుకుని, మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. చివరగా లడ్డూలను కొబ్బరి తురుములో దొర్లించి సర్వ్ చేయాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement