బీట్‌రూట్ పులావ్ | Beetroot pulao recipe | Sakshi
Sakshi News home page

బీట్‌రూట్ పులావ్

Published Sun, Jun 7 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

బీట్‌రూట్ పులావ్

బీట్‌రూట్ పులావ్

ఫుల్ మీల్స్
కావలసినవి: బియ్యం - 1 కప్పు, నీళ్లు - 2 కప్పులు, బీట్‌రూట్ తురుము - 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా,
కొత్తిమీర - కొద్దిగా, బిర్యానీ మసాలా - 1 చెంచా, గరం మసాలా - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, నిమ్మరసం - 1 చెంచా, సోంపు - అరచెంచా, బిర్యానీ ఆకు - 1, యాలకులు - 2, లవంగాలు - 2, దాల్చినచెక్క - చిన్నది, పుదీనా - కొద్దిగా
 
తయారీ: బియ్యాన్ని కాసేపు నానబెట్టాలి. గిన్నెలో నూనె వేసి, వేడెక్కాక సోంపు, లవంగాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించాలి. తర్వాత బీట్‌రూట్ తురుము, కొత్తిమీర, బిర్యానీ మసాలా, గరం మసాలా, ఉప్పు వేయాలి. వేగాక నీళ్లు పోసి, నిమ్మరసం పిండి మూత పెట్టాలి. నీళ్లు మరిగాక బియ్యం వేసి, ఓసారి బాగా కలిపి మూత పెట్టాలి. అన్నం ఇగిరిపోయాక దించేసుకుని, పుదీనా చల్లి వడ్డించాలి.
 

రటిపండు పాయసం
కావలసినవి: అరటిపండ్లు - 2, పాలు - 2 కప్పులు, నీళ్లు - అరకప్పు, చక్కెర - అరకప్పు, యాల కుల పొడి - అరచెంచా, నెయ్యి - 3 చెంచాలు, తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు కలిపి - పావుకప్పు
 
తయారీ: అరటిపండ్లను ఒలిచి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసి, కరిగాక డ్రైఫ్రూట్స్‌ని వేయించి తీసేయాలి. అదే గిన్నెలో అరటిపండు పేస్ట్ వేసి రంగు మారేవరకూ వేయించాలి. తర్వాత చక్కెర వేసి కాపేపు వేయించాలి. చక్కెర కరిగి కాస్త పాకంలాగా అవుతుండగా నీళ్లు, పాలు పోసి ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కగా అవుతున్నప్పుడు యాలకుల పొడి వేసి కలిపి, కావాలంటే కాస్త నెయ్యి కూడా పోసుకుని దించేయాలి. డ్రైఫ్రూట్స్ వేసి కలిపి వడ్డించాలి. కేరళలో ఈ పాయసంలో చక్కెర బదులు బెల్లం వేసి చేసుకుంటారు. కావాలంటే అలా చేసుకోవచ్చు.

రెంజ్ చికెన్
కావలసినవి: బోన్‌లెస్ చికెన్ - అరకిలో, ఆరెంజ్ జ్యూస్ - 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు - పావుకప్పు, కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు, కోడిగుడ్లు - 2, వెనిగర్ - 5 చెంచాలు, అల్లం తురుము - 1 చెంచా, వెల్లుల్లి తురుము - 1 చెంచా, మిరియాల పొడి - అర చెంచా, ఉప్పు, నూనె - సరిపడా, సోయా సాస్ - 2 చెంచాలు, టొమాటో కెచప్ - 1 చెంచా
 
తయారీ: కోడిగుడ్డు సొనను బీట్ చేసుకోవాలి. చెంచాడు కార్న్ ఫ్లోర్‌ను చల్లని నీటిలో కలిపి పెట్టుకోవాలి. చికెన్ ముక్కల్ని కాసేపు ఉడికించాలి. తర్వాత ఓ బౌల్‌లో చికెన్, ఆరెంజ్ జ్యూస్, వెనిగర్, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. అరగంట తర్వాత ఈ ముక్కల్ని కోడిగుడ్డు సొనలో ముంచి, కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి ఫ్రై చేయాలి (డీప్ ఫ్రై చేయకూడదు). కాస్త నూనె వేడిచేసి అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఉల్లికాడల తురుము వేయించాలి. తర్వాత సోయా సాస్, టొమాటో కెచప్ కూడా వేయాలి. చివర్లో చికెన్ కూడా వేసి వేయించి దించెయ్యాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement