రేటు వింటే.. ముద్ద దిగదు.. | New Hard Rock Hotel in Ibiza to open Sublimotion | Sakshi
Sakshi News home page

రేటు వింటే.. ముద్ద దిగదు..

Published Tue, Apr 29 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

రేటు వింటే.. ముద్ద దిగదు..

రేటు వింటే.. ముద్ద దిగదు..

ఫుల్ మీల్స్ భోజనం ఎంత? మామూలు హోటల్లో రూ.100 లోపు.. స్టార్ హోటల్ స్థాయికెళితే.. మనం తీసుకునే ఐటంలను బట్టి ఉంటుంది. కానీ రూ.1.22 లక్షలుంటుందా? ఇదిగో చిత్రంలోని కనిపిస్తున్న హార్డ్ రాక్ హోటల్‌లోని సబ్‌లిమోషన్ రెస్టారెంట్లో అంతే ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్‌గా రికార్డునూ సృష్టించనుంది.
 
 స్పెయిన్‌లోని ఇవిత ద్వీపంలో నిర్మించిన ఈ హోటల్‌ను మే 18న ప్రారంభించనున్నారు. ఇందులోని సబ్‌లిమోషన్ రెస్టారెంట్‌లో 20 రకాల ఆహార పదార్థాలతో కూడిన ఫుల్ మీల్స్‌కు ఒక్కొక్కరి నుంచి ఇంత భారీ రేటును వసూలు చేయనున్నారు. అంతేకాదు.. ట్రిప్‌కు 12 మందినే అనుమతిస్తారు. వాళ్లు పూర్తిగా ఆరగించినతర్వాతే మిగతావారికి చాన్స్ అన్నమాట. స్పెయిన్‌లో పేరొందిన చెఫ్ పాకో రోన్‌సెరో వీటి రూపకర్త. మెనూ వివరాలను వెల్లడించనప్పటికీ మునుపెన్నడూ చవిచూడని అనుభూతి ఖాయమని భరోసా ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement