బెబో...ట్రెండ్ సెట్టర్! | Kareena Kapoor Trend Setter | Sakshi
Sakshi News home page

బెబో...ట్రెండ్ సెట్టర్!

Published Sun, Nov 19 2017 12:30 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Kareena Kapoor Trend Setter - Sakshi

కరీనా కపూర్‌ ట్రెండ్‌ సెట్టర్‌..
‘సైజ్‌ జీరో’ అంటూ ఒక ట్రెండ్‌ పట్టుకొచ్చింది. అందరూ దాన్ని ఫాలో కాగానే, కర్వీగా ఉండడమే అందం అనేసింది.మాస్‌ సినిమాల్లో కనిపిస్తే చాలు అని హీరోయిన్లు అనుకున్నప్పుడల్లా కొత్త కొత్త జానర్స్‌ను ఎంచుకుంది.ఎప్పటికప్పుడు ట్రెండ్‌ సృష్టిస్తుంది. అందరూ ఆ ట్రెండ్‌ను అందుకోగానే మళ్లీ కొత్త ట్రెండ్‌. ఈ ట్రెండ్‌సెట్టర్‌ విశేషాలివీ...

అమ్మే పెంచింది..
బాలీవుడ్‌లో కపూర్‌ ఫ్యామిలీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. కరీనా కపూర్‌ అయినా, అక్క కరిష్మా కపూర్‌ అయినా, అనుకుంటే ఈజీగా హీరోయిన్లు అయిపోవచ్చు. కానీ తండ్రి రణధీర్‌ కపూర్‌కు తన పిల్లలు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. ఒప్పుకోలేదు. ‘పిల్లలను నేనే పెంచి పెద్ద చేస్తా’ అని బబితాకపూర్‌ రణధీర్‌కు దూరమైంది. ఇద్దరు పిల్లలనూ స్టార్లను చేసింది. ‘మా ఇద్దరినీ అమ్మే పెంచి పెద్ద చేసింది’ అని చెబుతూంటుంది కరీనా. ‘అలాగని నాన్న ప్రభావం నా మీద లేదని చెప్పను’ అని కూడా అంటుంది. కరీనా సూపర్‌స్టార్‌ అయ్యాక రణధీర్‌ మళ్లీ ఇంటికి దగ్గరయ్యాడు. వారిది ఇప్పుడు క్యూట్‌ ఫ్యామిలీ.

క్యూట్‌ ఫ్యామిలీ...
సైఫ్‌ అలీఖాన్, కరీనాకపూర్‌లకు హాట్‌ కపుల్‌ అన్న పేరుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటి నుంచే ఈ జోడీకి మంచి పేరుంది. ఇప్పుడు వీరి జీవితంలోకి తైమూర్‌ కూడా వచ్చేశాక క్యూట్‌ ఫ్యామిలీ అంటూ అభిమానులు వీరికి ఒక స్పెషల్‌ ప్లేస్‌ ఇచ్చేస్తారు. సైఫ్‌.. కరీనా.. తైమూర్‌.. నిజంగానే క్యూట్‌ ఫ్యామిలీ!!


స్టార్‌డమ్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే..
2004లో కరీనా దశతిరిగే సినిమాలొచ్చాయి. అక్కణ్నుంచి ఆమె ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2012లో కెరీర్‌ పీక్స్‌లో ఉంది. స్టార్‌గా ఒక ప్రత్యేక స్థాయి ఉంది. అలాగే కెరీర్‌పైనే దృష్టి పెడదాం అనుకుంటారు అందరూ. కరీనా మాత్రం బాయ్‌ఫ్రెండ్‌ సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లాడి సినిమాలకు చిన్న బ్రేక్‌ ఇచ్చింది. అయితే అది చిన్న బ్రేక్‌ మాత్రమే! పెళ్లయ్యాకా తన స్టార్‌డమ్‌ తగ్గదని నిరూపిస్తూ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ ఇచ్చింది. ఇక 2016లో కరీనా దంపతులకు కొడుకు పుట్టాక ఆమె కెరీర్‌ అక్కడితో ఎండ్‌ అనుకున్న వారికి సమాధానంగా అప్పుడే సెట్స్‌పైకి ఓ సినిమా తీసుకెళ్లారు. కరీనా కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌కు ఈ డిసెంబర్‌ వస్తే ఏడాది.

సైజ్‌ జీరో..
‘సైజ్‌ జీరో’ అనే ఒక ట్రెండ్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసిందే కరీనా కపూర్‌. సన్నగా మారిపోయి, ఆ లుక్‌ కోసం చాలా బరువు తగ్గిపోయింది. ఆ లుక్‌తో ఆమె చేసిన హల్‌చల్‌కు బాలీవుడ్‌ ఫిదా అయిపోయింది. అందరికీ సైజ్‌ జీరో ఓ క్రేజ్‌గా మారిపోయింది. అయితే కరీనా కపూర్‌ మాత్రం మళ్లీ వెంటనే తన పాత లుక్‌కే వచ్చేసింది. కర్వీగా కనపడడంలోనే అందం ఉంది అనేసింది. తన ఫిజిక్‌ ఎలా ఉన్నా ప్రపంచం ముందు దాచేది కాదు. ప్రెగ్నెంట్‌గా ఉన్న రోజుల్లో, బాబు పుట్టాక లావయ్యాకా తన ఫొటోలను పోస్ట్‌ చేయడం ఆపలేదు. ‘మన బాడీ ఎలా ఉన్నా అది మనం ఇష్టపడాలి. అలా పోజ్‌ ఇవ్వగలగాలి’ అంటుంది కరీనా. అదే సైజ్‌ జీరో సాహసం చేసిన స్టార్‌.

కెరీర్‌ మొదలవ్వకముందే..
కరీనాకపూర్‌ కెరీర్‌ ఒక బ్లాక్‌బస్టర్‌తో మొదలుకావాలి. ‘కహో నా ప్యార్‌ హై’ అంటూ హృతిక్‌ రోషన్‌ డెబ్యూట్‌ సినిమా మొదలైంది. హీరోయిన్‌ కరీనాకూ డెబ్యూట్‌. కొన్నాళ్లు షూటింగ్‌ కూడా జరిగింది. సడెన్‌గా కరీనాను సినిమా నుంచి తప్పించేశారు. అంతే! బ్లాక్‌బస్టర్‌తో మొదలవ్వాల్సిన కెరీర్‌ ఒక్కసారే ఆగిపోయింది. అయితే కరీనా కెరీర్‌ వేరేలా రాసి ఉంది. కొన్నాళ్లు ఎదురుచూడాల్సి వచ్చినా ఆమె సూపర్‌స్టార్‌గా ఎదిగేందుకు పడిన చిన్న కష్టమే అది! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement