హీరోయిన్ ప్రెగ్నెన్సీపై తండ్రి ఏమన్నాడు.. | Randhir Kapoor finally comments on daughter Kareena pregnancy buzz | Sakshi
Sakshi News home page

హీరోయిన్ ప్రెగ్నెన్సీపై తండ్రి ఏమన్నాడు..

Published Thu, Jun 2 2016 7:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

హీరోయిన్ ప్రెగ్నెన్సీపై తండ్రి ఏమన్నాడు.. - Sakshi

హీరోయిన్ ప్రెగ్నెన్సీపై తండ్రి ఏమన్నాడు..

ముంబయి: రెండేళ్ల వరకూ పిల్లలు వద్దనుకున్నాం, అయినా నేను ప్రెగ్నెంట్ అని మీకు ఎవరు చెప్పారు.. అసలు ఎక్కణ్ణుంచి ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదు... ఈ మాటల్ని బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ ఆ మధ్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితి మారింది. 'బెబో' కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ తల్లిదండ్రులు అవ్వనున్నారు. నిన్నటివరకూ ఇది కేవలం ఓ వదంతి మాత్రమే. అయితే ఈ వదంతులకు కరీనా తండ్రి రణదీర్ కపూర్ కాస్త బలాన్ని చేకూర్చారు.

కరీనా ప్రెగ్నెన్సీపై మీడియా ఆయనను సంప్రదించింది. ఈ విషయాన్ని కూతురు కరీనా, అల్లుడు సైఫ్ తనకు చెప్పలేదంటూనే.. త్వరలో తాను తాత కాబోతున్నట్లు చెప్పేశాడు. ఇప్పటివరకు కేవలం ప్రచారంలో ఉన్న వార్త నిజమేనని తెలిపోయింది. అయితే అందరు అనుకున్నట్లుగా కరీనా మూడు నెలల గర్భవతి కాదు.. మూడున్నర నెలల గర్భవతి అంటూ రణదీర్ సంతోషాన్ని పంచుకున్నారు. కరీనా ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని ఎంజాయ్ చేసేందుకు కరీనా, అల్లుడు సైఫ్ లండన్ లో కొన్ని రోజులు ట్రిప్ కు వెళ్లి వచ్చారని కథనాలు వచ్చాయి.  రణదీర్ పెద్ద కూతురు కరీష్మాకపూర్ కాగా, రెండో కూతురు కరీనా కపూర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement