మేం నూతిలో కప్పలం కాదు!
మేం నూతిలో కప్పలం కాదు!
Published Mon, Nov 11 2013 1:28 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘మా ఇంట్లో ఓ రూల్ పెట్టుకున్నాం. ఆ రూల్ ప్రకారం ఇంట్లో సినిమాల గురించి కానీ ఇతర నటీనటుల గురించి కానీ మాట్లాడకూడదు. ఇంట్లో ఉండేది తక్కువ సమయం కాబట్టి, ఇంటి విషయాలు మాత్రమే మాట్లాడాలన్నది మా నిర్ణయం’’ అన్నారు కరీనాకపూర్. సైఫ్, తనూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత ఈ రూల్ పెట్టుకున్నారట. అలాగే, కేవలం సినిమా పరిశ్రమవారితో మాత్రమే కాకుండా, బయటివారితో కూడా స్నేహంగా ఉంటామని కరీనా చెబుతూ -‘‘నాకూ సైఫ్‌కీ నూతిలో కప్పల్లా బతకడం ఇష్టం ఉండదు. అందుకే, మా కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ల ద్వారా ఏర్పడిన ఫ్రెండ్స్ అందరితోనూ టచ్‌లో ఉంటాం. అదే కనుక మేం సినిమావాళ్లతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. అలా బతకడం ప్రమాదం.
అందుకే, అంతస్తులతో సంబంధం లేకుండా స్నేహాలు చేస్తాం. సినిమా ప్రపంచం చెడ్డదని చెప్పడంలేదు. కానీ, ఇక్కడ ‘నిజం’ తెలుసుకోవడం కష్టమే. ఒకవేళ నేను వేసుకున్న డ్రెస్ బాగా లేదనుకోండి... అది చెప్పేవాళ్లు కూడా ఉండరు. ‘సూపర్ మేడమ్’ అంటారు. నా సినిమా ఫ్లాప్ అయినా ‘సూపర్ హిట్’ అని చెప్పేవారి సంఖ్యే ఎక్కువ. మొహమాటం వల్ల అలా చేస్తుంటారు. అందుకని, వాళ్లని తప్పు పట్టడంలేదు. కానీ, సైఫ్‌కీ నాకూ వాస్తవంలో బతకాలని ఉంటుంది. అందుకే బయటివాళ్లతో స్నేహంగా ఉంటాం. అప్పుడు వంద శాతం కాకపోయినా... అరవై, డెబ్భై శాతం నిజాలు తెలుస్తుంటాయి. సినిమా పరిశ్రమకు సంబంధించిన కొన్ని పార్టీలను మిస్ చేసుకుని మరీ బయటి స్నేహితులకు మేం సమయం కేటాయిస్తుంటాం’’ అని చెప్పారు.
Advertisement
Advertisement