ఆస్పత్రి నుంచి నేరుగా షూటింగ్‌కే: హీరోయిన్‌ | I head straight from the hospital to a shoot, says actress | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి నేరుగా షూటింగ్‌కే: హీరోయిన్‌

Published Sun, Nov 20 2016 8:14 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఆస్పత్రి నుంచి నేరుగా షూటింగ్‌కే: హీరోయిన్‌ - Sakshi

ఆస్పత్రి నుంచి నేరుగా షూటింగ్‌కే: హీరోయిన్‌

బాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన కరీనా కపూర్‌ త్వరలోనే అమ్మ అవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే డిసెంబర్‌లో ఆమె తొలి బిడ్డను ప్రసవించబోతున్నది. అయితే, ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భవతి అయిన కరీనను ఆమె భర్త సైఫ్‌ అలీఖాన్‌ తెగ ఆటపట్టిస్తున్నాడట. గర్భవతి అయినా బిజీగా తిరుగుతున్న కరీన ఏ మెహబూబ్‌ స్టూడియోలోనో బిడ్డను కనేస్తుందని సైఫ్‌ టీజ్‌ చేస్తున్నాడట. కరీననే ఈ విషయం చెప్పింది.

‘గర్భవతిగా ఉన్నప్పటికీ బిజీబిజీగా గడుపుతున్నా. దీంతో మెహబూబ్‌ స్టూడియోలో నువ్వు బిడ్డను కనేస్తావేమో అని సైఫ్‌ అంటున్నాడు. నా స్నేహితులు కూడా టీజ్‌ చేస్తున్నారు. శాంతంగా ఉండు తక్కువ పనిచెయ్యి అంటున్నారు. కానీ నా గురించి తెలిసినవారు నేను ఆస్పత్రి నుంచి నేరుగా షూటింగ్‌కు వెళ్లినా ఏమీ ఆశ్చర్యపోరు. బిడ్డ పుట్టిన ఒక నెలలోనే నేను కచ్చితంగా మళ్లీ వర్క్‌లో నిమగ్నమవుతాను’ అని కరీన వివరించింది. కరీన, సైఫ్‌ దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ గురించి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపారనే కథనాలను కరీన తోసిపుచ్చింది. అలాంటిదేమీ లేదని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement